కమలాఫలంతో అందానికి మెరుగులు…

మాస్ న్యూస్:తక్కువ సమయంలోనే అందానికి మెరుగులు దిద్దుకోవడానికి తోడ్పడేవాటిలో కమలాఫలం ఒకటి. ఇది అన్ని రకాల చర్మతత్వాల వారికి చక్కగా నప్పుతుంది. ముఖం కాంతివంతంగా: దుమ్ము, ధూళి ప్రభావం వల్ల కొందరి చర్మం కాంతివిహీనంగా మారుతుంది. ఇలాంటప్పుడు కమలాఫలం తొక్కని ఒలిచి ఎండ బెట్టుకొని పొడిచేసుకోవాలి. రెండు చెంచాల ఈ పొడిలో కాసిని పాలు, చెంచా గంధం కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేసుకొంటే మేని కాంతివంతంగా తయారవుతుంది. మేని మృదుత్వానికి: రెండు […]

వేణుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

మాస్ న్యూస్:హాస్యనటుడు వేణుపై జరిగిన దాడిని జబర్దస్త్ న్యాయనిర్ణేత నాగబాబు ఖండించారు. వేణుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నాగబాబు మాట్లాడారు.‘వేణుపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. లక్షల దాడులు జరిగినా జబర్దస్త్ కార్యక్రమం ఆగదు. వేణును అమానుషంగా కొట్టడం తప్పు. తమ నటులు వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కార్యక్రమాలు చేయడం లేదు. ఒక వేళ మీకు అలా అనిపిస్తే.. పోలీసులు, కోర్టులు, […]

పీకే సినిమా వసూళ్ల దూకుడు…

మాస్ న్యూస్: మిస్టర్‌ పెర్ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌ ఓ సినిమాలో నటిస్తే అది కచ్చితంగా సంచల నం అవ్వాల్సిందే. బాక్సాఫీస్‌ రికార్డులు తిరగరాయా ల్సిందే. బాలీవుడ్‌లో ప్రస్తుతం అతడు నటించిన పీకే సినిమా గురించే ఆసక్తికర చర్చ. ఈ సినిమా ఓపెనింగ్‌ వసూళ్ల దూకుడు చూస్తుంటే కచ్ఛితంగా రూ.300కోట్ల నుంచి 600కోట్ల మధ్య వసూళ్లు సాధించడం సాధ్యమేనని ట్రేడ్‌ పండితులు విశ్లేషి స్తున్నారు. ఆ మేరకు తొలిరోజు ఏకంగా స్వద ేశంలో రూ.27కోట్లు వసూలు చేసి, కేవలం […]

ఢిల్లీలో ఇరు రాష్ట్రాల విద్యుత్ నిపుణులు భేటీ!

మాస్ న్యూస్:ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన విద్యుత్ వివాదాల అంశంలపై సోమవారం ఢిల్లీలో నీరజ్ మాథూర్ కమిటీ వద్ద ఇరు రాష్ట్రాల విద్యుత్ నిపుణులు భేటీ అవుతున్నారు. నీరజ్ మాథుర్ కమిటీ ఇరు రాష్ట్రాల వాదనలు విని వివాదాల పరిష్కారానికి కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. విద్యుత్ వినిమయం ఆధారంగా తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్‌లో 53.89 శాతాన్ని, ఆంధ్రాకు 46.11 శాతాన్ని కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌లో 46.11 శాతాన్ని తమకు కేటాయించడం […]

హైదరాబాద్‌లో గూగుల్ క్యాంపస్‌…

మాస్ న్యూస్:ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ హైదరాబాద్‌లో క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయు కుదుర్చుకోనుంది. యుఎస్, యుకె తరువాత హైదరాబాద్‌లో గూగుల్ మూడవ క్యాంపస్ ప్రారంభించబోతుందని ఐటి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెక్రటరీ హర్‌ప్రీత్‌సింగ్ తెలిపారు. ప్రస్తుతం గూగుల్ అద్దె భవనంనుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. త్వరలో పెద్ద భవనంలో శాశ్వత క్యాంపస్ నిర్మించనుంది. సిస్కో, ఏయిర్‌టెల్, వోడాఫోన్, తైవాన్ కంపెనీలు వైఫై పై ఆసక్తి చూపుతున్నట్టు, నగరానికి సంబంధించి వివరాలు అడిగినట్టు హర్‌ప్రీత్ […]

స్మార్ట్ గ్రామం -స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఆదా …

మాస్ న్యూస్: జనవరి 1నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాకరంగా అమలు చేయనున్న స్మార్ట్ గ్రామం -స్మార్ట్ ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ ఆదా పథకాన్ని చేర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. కార్యక్రమంలో ప్రజలు, కార్పోరేట్ సంస్ధలను భాగస్వాములను చేయాలని కోరారు. ప్రతి గ్రామంలో వౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, పర్యావరణం, ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య అనుసంధానంలో విద్యుత్ కీలకాంశంగా ఉందన్నారు. ఈమేరకు విద్యుత్ అధికారులు ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. ఆదివారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి […]

అన్ని పార్టీలు అంగీకరిస్తేనే మత మార్పిడి నిరోధక చట్టం !

మాస్ న్యూస్: మత మార్పిడి నిరోధక చట్టాన్ని ఏకపక్షంగా చేయాలన్న ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం. వెంకయ్య నాయుడు తెలిపారు. దీనిపై ప్రతిపక్షాలు అనవసరంగా గగ్గోలు పెడుతూ రాద్ధాంతం చేస్తున్నాయని ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. మత మార్పిడి నిరోధక చట్టాన్ని తీసుకుని వద్దామా? అని పార్లమెంటులో ప్రతిపాదించడంతోనే ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని తెలిపారు. దీనిపై చర్చ జరిగి, అన్ని పార్టీలు అంగీకరిస్తేనే చట్టం చేస్తాం తప్ప బలవంతంగా చట్టం […]

నామినేటెడ్ పదవుల పందేరం..

మాస్ న్యూస్: కొత్త ఏడాదినుంచి పథకాల అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, మరోవైపు పార్టీలో పదవుల పందేరంపై దృష్టి సారించారు. పూర్తిస్థాయిలో మంత్రివర్గం ఏర్పాటు పూర్తి చేయడంతో, ఇక నామినేటెడ్ పదవుల భర్తీకి ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. ఈ నెలాఖరు నుంచి వచ్చే నెల మొదటి వారంలోగా నామినేటెడ్ పదవులన్నీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. జిల్లాలు, సామాజిక వర్గాల సమీకరణలతోపాటు గత ఎన్నికలలో అనేక కారణాలతో టిక్కెట్ ఇవ్వలేకపోయిన […]