Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

కాంగ్రెస్ అభివృద్ధిని అడ్డుకుంటుంది – కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిబాయి చౌదరి – part 2

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

నల్గొండ (మాస్ న్యూస్) : దేశాభివృద్ధికి కాంగ్రెస్ ఎంపీ లు అడ్డుపడుతున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిబాయి చౌదరి ఆరోపించారు. బీ.జే.పీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా చైతన్య యాత్ర బహిరంగ సభ బుదవారం జిల్లా కేంద్రంలోని గడియారం చౌరస్తాలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధిగా హాజరైన హరిబాయి చౌదరి మాట్లాడుతూ పార్లమెంట్ లో ఎనిమిది శాతం గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తున్న ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వాన్ని దేశ కాంగ్రెస్ పాలనలో దేశం అన్ని విధాలా నష్టపోయిందని, కాంగ్రెస్ నాయకులు కుంభకోణాలమయంగా దేశాన్ని దోచుకుతిన్నారన్నారు. పేద ప్రజల కోసం ప్రధాని మోడీ అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. భీమా అటల్ యోజన, స్వచ్చ భారత్ లాంటి ప్రజోపయోగ కరమైన పథకాలు ప్రవేశ పెట్టడం జరిగింది. దేశ పార్లమెంట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సభామర్యాదలు విస్మరించి సమావేశాలను కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకున్నారని, వీరి మూలంగా పార్లమెంట్ లో ఆమోదం పొందాల్సిన 21 రకాల బిల్లులు ఆగిపోయాయన్నారు. దేశంలో ఇంకా 20 ఏళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోదని జ్యోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిషన్ రెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సమావేశాల్లో 44 మంది కాంగ్రెస్ ఎంపీలు వ్యవహరించిన తీరు దేశాభివృద్ధికే నిరోధకంగా మరే అవకాశం ఉందని అన్నారు. నరేంద్రమోడి ప్రధాని పదవిని చేపట్టటాన్ని సోనియాగాంధీ, రాహూల్ గాంధీలు జీర్ణించుకోలేక పోతున్నారు. కాంగ్రెస్ పాలన అంటేనే కుంభకోణాల మయంగా మారిందని ఎద్దేవా చేశారు. మోడీ ప్రధాని అయ్యాక పెట్రోల్, నిత్యావసర ధరలు తగ్గాయన్నారు. ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపే చూస్తున్నాయని మోడీ విదేశీ పర్యటనలో భారత్ సంస్కృతి, సంప్రదాయాలను చాటి చెప్తున్నారు అని అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క దేశం కూడా భారత్ వైపే చూడలేదన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగవడం ఖాయమని అన్నారు. బాకీ పాపయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీదర్ ఎంపీ బల్వంత్ కుంచె, బీజేపీ రాష్ట్ర కోశాధికారి గొంగిడి మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి చింతా సాంబమూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గోలి మధుసూదన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యఖుడు వీరేల్లి చంద్రశేఖర్, కాసం వేంకటేశ్వర్లు, శ్రీరామోజు షణ్ముఖ, ఓరుగంటి రాములు, పల్లె బోయిన శ్యాంసుందర్, మునుకుంట్ల వెంకన్న పోతెపాక సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

Leave a reply

You must be logged in to post a comment.