Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

మిలియన్ డాలర్ల రుణం రద్దు : పాక్కు ప్రపంచ బ్యాంకు షాక్‌

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో విఫలమైనందుకు ……

 

 

 

 

నేచురల్ గ్యాస్ ఎఫిషియెన్సీ ప్రాజెక్టు కోసం ఇవ్వాలనుకున్న 100 మిలియన్ డాలర్ల రుణాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. అభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో విఫలమైనందుకు, గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ తగిన శ్రద్ధ చూపించనందుకు ఈ కఠిన చర్య తీసుకుంటున్నట్లు పేర్కొంది. సుయి సదరన్ గ్యాస్ కంపెనీ (ఎస్ఎస్‌జీసీ) ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. పైప్‌లైన్ సిస్టమ్‌లో గ్యాస్ భౌతిక, వ్యాపార నష్టాలను తగ్గించుకుని, సహజ వాయువు సరఫరాను పెంచడం కోసం ఈ ప్రాజెక్టును చేపట్టారు. ప్రస్తుతం ఈ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న గ్యాస్‌ను కరాచీ, సింధ్, బలూచిస్థాన్‌ ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు.ప్రాజెక్టు విఫలమవడంతో మూతపడిందని, ఫలితంగా విలువైన సహజ వనరు వృథా అవుతోందని, లెక్కల్లో చూపని గ్యాస్ అత్యధికంగా ఉందని ప్రపంచ బ్యాంకు నివేదిక పేర్కొంది. అక్రమ కనెక్షన్లు పెరుగుతున్నాయని తెలిపింది. ఈ ప్రాజెక్టుకు తాము ఇస్తున్న రేటింగ్ ‘అన్‌శాటిస్ఫేక్టరీ’ అని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో ఎస్ఎస్‌జీసీకి తగినంత వాటా లేదని, ఎస్ఎస్‌జీసీ బోర్డు, యాజమాన్యం నుంచి ఈ ప్రాజెక్టుకు తగినంత మద్దతు లభించడం లేదని వివరించింది. 200 మిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు మొదట్లో అంగీకారం కుదిరినప్పటికీ 0.25 మిలియన్ డాలర్లు మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చింది.

Leave a reply

You must be logged in to post a comment.