Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

సంప‌న్న‌ దేశాల్లో భార‌త్ కు ఏడోస్థానం

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

 

వ్య‌క్తిగ‌త సంప‌ద ఆధారంగా ఈ ర్యాంకుల‌ను కేటాయించారు

 

ఇండియాలో పేద‌రికం ఉందేమోగానీ.. ఇండియా పేద దేశం కాదు. తాజాగా విడుద‌లైన న్యూ వ‌రల్డ్ వెల్త్ నివేదికే దీనికి నిద‌ర్శ‌నం. ప్ర‌పంచంలోని అత్యంత సంప‌న్న‌ దేశాల్లో భార‌త్ ఏడోస్థానంలో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. భార‌త్‌లోని మొత్తం వ్య‌క్తిగ‌త సంప‌ద 5600 బిలియ‌న్ డాల‌ర్లు (5 ల‌క్ష‌ల 60 వేల కోట్ల డాల‌ర్లు). టాప్ టెన్ లిస్ట్‌లో కెన‌డా (4700 బిలియ‌న్ డాల‌ర్లు), ఆస్ట్రేలియా (4500 బిలియ‌న్ డాల‌ర్లు), ఇట‌లీ (4400 బిలియ‌న్ డాల‌ర్లు) కంటే ముందే ఉండ‌టం విశేషం. ఈ జాబితాలో 48900 బిలియ‌న్ డాల‌ర్ల‌తో అమెరికా తొలిస్థానంలో నిలిచింది. ఆ త‌ర్వాతి స్థానాల్లో చైనా (17400 బిలియ‌న్ డాల‌ర్లు), జ‌పాన్ (15100 బిలియ‌న్ డాల‌ర్లు), యూకే (9200 బిలియ‌న్ డాల‌ర్లు), జ‌ర్మ‌నీ (9100 బిలియ‌న్ డాల‌ర్లు), ఫ్రాన్స్ (6600 బిలియ‌న్ డాల‌ర్లు) ఉన్నాయి.

ఇక్క‌డ సంప‌ద అంటే ఓ వ్య‌క్తి నిక‌ర ఆస్తి. అందులో ఆ వ్య‌క్తి ప్రాప‌ర్టీ, డ‌బ్బు, ఈక్విటీలు, వ్యాపార ప్ర‌యోజ‌నాల‌న్నీ ఉంటాయి. అప్పులు మాత్రం ఉండ‌వు. ఇందులో ప్ర‌భుత్వ నిధుల‌ను లెక్క‌లోని తీసుకోలేద‌ని న్యూ వ‌రల్డ్ హెల్త్ వెల్ల‌డించింది. అయితే అత్యంత సంప‌న్న దేశాల స‌ర‌స‌న నిల‌వ‌డానికి కార‌ణం భార‌త జ‌నాభానేన‌ని ఆ సంస్థ తెలిపింది. కేవ‌లం 2 కోట్ల 20 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న ఆస్ట్రేలియా 9వ ర్యాంకులో ఉండ‌టం గొప్ప విష‌య‌మ‌ని చెప్పింది. జూన్ 2016 వ‌ర‌కు మొత్తం వ్య‌క్తిగ‌త సంప‌ద ఆధారంగా ఈ ర్యాంకుల‌ను కేటాయించారు.

Leave a reply

You must be logged in to post a comment.