Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

అభివృద్ధి ప్యాకేజీపై చంద్రబాబు అసంతృప్తి

మాస్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెదవి విరిచారు. కేంద్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఏపీ ప్రభుత్వానికి నామమాత్రంగా నిధులు కేటా యించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలు స్తోంది. ఏపీలో వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధితో పాటు రెవెన్యు లోటు భర్తీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటిం చిన రూ.850 కోట్ల ఆర్థిక సహాయంపై సీఎం గురు వారం సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకర ణ చట్టంలోని సెక్షన్‌ 46(2) సెక్షన్‌ 46(3) ప్రకారం ఏపీకి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని, దానిలో భాగంగా ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన నేపథ్యంలో కేంద్రం ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీపై చంద్రబాబు మంత్రులు పి.నారాయణ, గంటా శ్రీనివాసరావు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్‌తో చర్చించారు. చట్టంలో తొలి […]

Continue Reading ...
  • ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ గైడ్‌లైన్స్‌

    మాస్ న్యూస్: తెలంగాణ రాష్ట్రాన్ని ఇండస్ట్రియల్‌ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి చట్టరూపం తెచ్చే పనిలో పడింది. ఇటీవల జరిగిన అసెంబ్లి సమా వేశాల్లో బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. ఈ నేప థ్యంలో ఇండస్ట్రియల్‌ పాలసీ మార్గదర్శకాల రూప కల్పనపై ప్రభుత్వం గత కొద్దిరోజులుగా చేస్తున్న కసరత్తు పూర్తయింది. సింగిల్‌ పాయింట్‌ క్లియ రెన్స్‌, ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా గైడ్‌లైన్స్‌ రూపొందాయి. పారిశ్రామిక వేత్త కేవలం దరఖాస్తు చేస్తే సరిపోతుందని, అనుమ తుల విషయాన్ని నోడల్‌ ఎజెన్సీయే చూసుకుంటుం దన్నది వాటి సారాంశం. దీంతో దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో అన్ని రకాల అనుమతులు ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా వెబ్‌ సైట్‌ను ఇన్పోసిస్‌ డెవలప్‌ చేస్తోంది. వెబ్‌సైట్‌ తయా రవగానే మార్గదర్శకాలు అందులో పెడుతామని అధికారులు చెబుతున్నారు. […]

    Continue Reading ...
  • మందకొడిగా తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు

    మాస్ న్యూస్: తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమం మందకొడిగా సాగుతోంది. కాంగ్రెస్‌ శ్రేణుల్లో రాష్ట్ర స్థాయి నుంచి క్షేత్ర స్థాయి వరకు తీవ్ర నిర్లిప్తత చోటు చేసుకోవడంతో పార్టీ సభ్యత్వ నమోదుకు అనుకున్న మేర స్పందన కనిపించడం లేదని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అన్ని జిల్లాల్లోనూ ఇదే విధంగా ఉందని, ముఖ్యంగా రాజధాని నగరంలో స్పందన చాలా తక్కువ ఉందని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. వాస్తవానికి ఈసారి రాష్ట్రంలో 16 లక్షల సభ్యత్వాలను నమోదు చేయించాలని రాష్ట్ర నేతలు భావించారు. కానీ జనవరి 21, 23 తేదీలలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశాల నాటికి 6 లక్షల సభ్యత్వాలు మాత్రమే చేయించగలిగారు. జనవరి 23 నుంచి ఇప్పటివరకు మరో లక్ష వరకు సభ్యత్వాలు నమోదయ్యాయి. తొలుత గత ఏడాది డిసెంబర్‌ నాటికి సభ్యత్వ నమోదును పూర్తి చేస్తామంటూ తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రకటించింది. కానీ ఒక్క జిల్లా […]

    Continue Reading ...
  • కలసి పోటీ చేద్దాం ! ఎవరిబలమేందో తేలిపోతుంది

    మాస్ న్యూస్: మధ్యంతర ఎన్నికలు వస్తాయంటున్న టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు దమ్ముంటే నాపై పోటీ చేసేందుకు నీవు రాజీనామా చెయ్యి నేను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తాను ఇద్దరం కలిసి పోటీచేస్తే ఎవరి బలమేందో ప్రజలే నిర్ణయిస్తార ని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సవాల్‌ విసిరారు. వరంగల్‌ జిల్లా ఆత్మకూరు మండలం గూడెప్పాడ్‌లో టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. దయాకర్‌రావు పదేపదే పరకాలకు మధ్యంతర ఎన్నిక తప్పదంటూ మాట్లాడడం ఆయన అవి వేకానికి నిదర్శనమన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు తొత్తుగా మారిన ఆయన తనను విమర్శించే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీలో ఉండి పోరాటం చేసిన తనకు తెలంగాణ ప్రజలు గుర్తించి ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ప్రజల సంక్షేమం కోసం పాటుపడే నేత కేసీఆరేనని కొనియాడారు. ఇప్పటికైనా ఎర్రబెల్లి తెలంగాణను అభివృద్ధి చేసుకునేందుకు టీడీపీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని హితవు పలికారు.

    Continue Reading ...
  • 2014 జూన్‌ నెల నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌

    మాస్ న్యూస్: తెలంగాణ ఆవిర్భావించిర నాటి నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. ఈ అంశంపై గురువారం సచివాలయంలో ఆయన ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. 43 శాతం ఫిట్‌మెంట్‌ ఓకే చేశారు. ఆ తర్వాత ఉద్యోగ సంఘాల నేతలతో కలిసి ఆయన మీడియా ముందుకు వచ్చారు. వివరాలను సీఎం స్వయంగా ప్రకటించారు. ‘‘తెలంగాణ ఉద్యోగులకు రాష్ట్ర ఆవిర్భావం అంటే… 2014 జూన్‌ నెల నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తాం. ఈ ఏడాది ఫిబ్రవరి వరకు బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్‌ ఖాతాలో జమ చేస్తాం. మార్చి వేతనం నుంచి 43 శాతం ఫిట్‌మెంట్‌తో, కొత్త జీతం చెల్లిస్తాం’’ అని కేసీఆర్‌ ప్రకటించారు. 43 శాతం ఫిట్‌మెంట్‌వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.6500 కోట్ల మేరకు అదనపు భారం పడుతుందని తెలిపారు. ‘‘జూన్‌ 2న తెలంగాణ ఆవిర్భవించింది. అందుకే పీఆర్సీ ప్రయోజనాలను తెలంగాణ ఆవిర్భావ […]

    Continue Reading ...
  • కోరిన ఫ్లేవర్‌లో సారా ప్యాకెట్‌

    మాస్ న్యూస్: కోరిన రంగులో కోరినంత పరి మాణంలో ఆకర్షణీయమైన ప్యాకెట్‌లో సారాను అందించేందుకు అధి కారులు కసరత్తును ముమ్మరం చేశారు. ఈ దిశలో నూతన సారా పాలసీ ని రూపొందించి..సీఎం అనుమతి కోసం వేచిచూస్తున్నారు. తద్వారా రాష్ట్రంలో సారాను ఏరులై పారించేందుకు రంగం సిద్ధమైంది. నూతన సారా పాలసీని ప్రభుత్వం సిద్ధం చేసింది. తాజాగా అధికారులు సిద్ధం చేసిన సారా పాలసీ ముసాయిదా సీఎం వద్దకు చేరింది. సారాను అమలు లోకి తేవడమా ఛీప్‌ లిక్కర్‌ను దర తగ్గించి అమ్మడమా అనే అంశంపై మీమాంస నెలకొన్నప్పటికీ చీప్‌ లిక్కర్‌ను ప్రత్యేకంగా విక్రయించడం పాలసీకి విదుద్ధంగా ఉందని అధికారులు తేల్చారు. దీంతో సారాను మార్కెట్‌లోకి తేవడం ద్వారానే ఆదాయాన్ని ఆర్జించే వీలుందని ప్రభు త్వం కూడా ఒక అవగాహనకు వచ్చింది. త్వరలో మండలానికో సారా దుకాణం ఏర్పాటు కానుంది. సారా అమ్మకాలకే కాదు… తయారీకి టెండర్లను పిలవాలని ముహూర్తం సిద్ధం చేస్తున్నారు. […]

    Continue Reading ...
  • తెలంగాణలో పసుపుదళం సమరశంఖం

    మాస్ న్యూస్: తెలంగాణలో పసుపుదళం సమరశంఖం పూరించేందుకు రంగం సిద్ధమైంది. అధినేత పర్యటనతో తెలంగాణలో పార్టీ పటిష్టతకు నూతన జవసత్వాలు అందించేందుకు టీడీపీ సమాయత్తం అవుతోంది. తెలంగాణలో టీడీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరుగుతున్న నేప థ్యంలో చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరిం చుకుంది. పార్టీ పటిష్టతతోపాటు తెలంగాణ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు చంద్రబాబునాయుడు నడుం బిగించారు. తెలంగాణలొ తెలుగు దేశం పార్టీకి నూతన జవసత్వాలు నింపేందుకు  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన ఖరారైంది. ఈనెల 12న వరంగల్‌, 19న కరీంనగర్‌లో చంద్రబాబు పర్యటించ నున్నారు. టీఆర్‌ఎస్‌ ఆపరేషన్‌ ఆకర్ష్‌కు విరుగుడుగా ఈ పర్యటన ఉపయోగ పడుతుందని టీ టీడీపీ నేతలు ఆశాభావంతో ఉన్నారు. అయితే తెలంగాణకు ఏపీ సీఎం అన్యాయం చేస్తున్నారని, విద్యుత్‌ సమస్యకు ఆయనే కారణమని టీఆర్‌ఎస్‌ నేతలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు మాత్రం […]

    Continue Reading ...
  • సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి

    మాస్ న్యూస్: సీఎం కె. చంద్రశేఖరరావు గురువారం ఢిల్లీకి వెళ్లనున్నారు. దాదాపు వారంరోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ప్రధాని మోదీతోపాటు, పలువురు కేంద్ర మం త్రులను కలవనున్నట్టు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తెలిపారు. బుధవారం ఆయన సచివాలయం లో విలేకరులతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ 6నుంచి 10వ తేదీ వరకూ ఢిల్లీలో ఉంటారని, ప్రధాని, పలువురు కేంద్ర మంత్రులను కలిసి తెలంగాణ సమస్యలను, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథ కాలను వివరించనున్నారని తెలిపారు. ఈనెల 8వ తేదీన ప్రణాళికా సంఘానికి ప్రత్యామ్నాయంగా అమలు చేయబోతున్న ‘నీతి ఆయోగ్‌’పై జరిగే సదస్సుకు కేసీఆర్‌ హాజరవుతారని చెప్పారు. ఇదే సందర్భంలో సీఎం ప్రధానితో భేటీ అవుతారని పేర్కొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, వెంకయ్య, నితిన్‌గడ్కరీ, అరుణ్‌జైట్లీ, ప్రకాశ్‌ జవదేకర్‌, ఉమాభారతి, నందా, రామ్‌విలాస్‌ పాశ్వాన్‌, వీరేంద్ర సింగ్‌ తదితర దాదాపు 12 మందిని సీఎం కలిసి వివిధ అంశాలపై చర్చించే అవకా […]

    Continue Reading ...
  • 2018 నాటికి మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా తెలంగాణ

    మాస్ న్యూస్: సారి రబీ పంటకు కూడా విద్యుత్‌ కష్టాలు తప్పకపోవచ్చని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాదినుంచి రైతులకు ఒకే విడతలో విద్యుత్‌ సరఫరా చేసే పరిస్థితి ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే మూడేళ్లలో(2018 నాటికి) తెలంగాణ రాష్ట్రం.. మిగులు విద్యుత్‌ రాష్ట్రంగా మారాలని ఆయన అధికారులనుఆదేశించారు. 2018 చివరి నాటికి రాష్ట్రంలో 21,350 మెగావాట్ల థర్మల్‌ విద్యుదుత్పత్తి కావాల్సిందేనని ఆయన స్పష్టం చాశారు. జల విద్యుదుత్పత్తితో కలుపుకొంటే అది 24 వేల మెగావాట్లు అవుతుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిపై అధికారులతో ముఖ్యమంత్రి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నేక అంశాలను వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో 4300 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులో ఉందని, డిమాండ్‌ 6000 మెగావాట్లు ఉందన్నారు. ఈ ఏడాది చివరి నాటికి మరో 2000 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందని, దీంతో..కొంత లోటు తీరుతుందని ఆయన వివరించారు. ఈ […]

    Continue Reading ...
  • నవ్యాంధ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ

    మాస్ న్యూస్: రాష్ట్ర విభజన సందర్భంగా నవ్యాంధ్రకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. ప్రత్యేక హోదా, తొలి ఏడాది రెవెన్యూలోటు భర్తీ వంటి సంగతులు పక్కనపెట్టి ప్రస్తుతానికి వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.350 కోట్లు సహాయం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వానికి మరో రూ.500 కోట్లు ‘ఆర్థిక మద్దతు’ ఇచ్చింది. అలాగే… ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాష్ట్రానికీ ‘పరిమితమైన’ పారిశ్రామిక రాయితీలు ఇచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం రాత్రి దీనిపై ప్రకటన జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ చట్టంలోని 46(2), 46(3) సెక్షన్ల ప్రకారం కొత్తగా ఏర్పడ్డ ఏపీలోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు… రాయలసీమలోని నాలుగు, ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలకు నిధులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. 2014-15 సంవత్సరానికి జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ.350 కోట్లు మంజూరు చేస్తున్నాం అని […]

    Continue Reading ...
  • రాష్ట్ర రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌

    మాస్ న్యూస్:  రాష్ట్ర రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌ను జూన్ నాటికి తయారు చేసి అందించేందుకు సింగపూర్ బృందం హామీనిచ్చింది. సింగపూర్ బృందంతో సిఎం చంద్రబాబు మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యారు. కొత్త రాజధానిలో అభివృద్ధి, నమూనాలు, ఘన వ్యర్ధాల నిర్వహణ వంటి అనేక అంశాలపై చర్చించారు. జూన్‌లో మాస్టర్ ప్లాన్ వచ్చిన తరువాత ఎలా ముందుకు సాగాలన్న కోణంలో చర్చించారు. కొత్త రాజధానికి సరితూగే స్థాయిలో మరో నగరం లేదన్న విధంగా నిర్మాణం జరగాలని, దీనికోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని బాబు సింగపూర్ ప్రతినిధులను కోరారు. అలాగే కొత్త రాజధానిలో ఘన వ్యర్ధాల నిర్వహణకు కూడా ప్రపంచస్థాయి సాంకేతిక సహకారాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు. సింగపూర్ కన్సల్టెంట్లు అందించిన రెండు రాజధాని అభివృద్ధి నమూనాలను చంద్రబాబు అధ్యయనం చేశారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి ప్రణాళిక, ఇళ్ల నిర్మాణం, సమగ్ర రవాణా వ్యవస్థ, ఇతర అభివృద్ధి అంశాలపై తాము రాజధాని ప్రాంత […]

    Continue Reading ...
  • రూ.98,679 కోట్లతో నాబార్డు రుణ ప్రణాళిక

    మాస్ న్యూస్:2015-16 ఆర్థిక సంవత్సరానికి నాబార్డు రూ.98,679 కోట్లతో రుణ ప్రణాళికను రూపొందించింది. గత ఏడాది కంటే ఇది 27 శాతం అధికం కావడం విశేషం. నాబార్డు నిర్ణయంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కష్టాల్లో ఉన్నామని, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సమయంలో కన్నా ఇప్పుడు 13 జిల్లాలకు ఇంత పెద్ద మొత్తంలో రుణ సాయం చేసేందుకు నాబార్డు ముందుకు రావడంపై కృతజ్ఞతలు తెలిపారు. నాబార్డు రుణ సదస్సులో గురువారం ఆయన మాట్లాడుతూ లాభసాటి వ్యవసాయానికి 15 రోజుల్లో పూర్తిస్థాయి ప్రణాళిక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. నదుల అనుసంధానంతో గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు మళ్లింపు, కాలువల పూడిక తీతలు, భూగర్భ జలాలను పెంచడం, డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా మెరుగైన సాగునీటి యాజమాన్యానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నదుల అనుసంధానం ద్వారా అదనంగా 50 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే సామర్థ్యం పెరుగుతుందన్నారు. […]

    Continue Reading ...
  • తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సంస్కరణలు వాయిదా

    మాస్ న్యూస్: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌లో సంస్కరణలు వాయిదా పడినట్లే! కొన్నేళ్లుగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా వీలైనంత త్వరగా ఒక గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ జారీ చేయాలంటూ సిలబస్‌ రివ్యూ కమిటీ సూచించింది. గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేయడంపై నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సర్కారుకే వదిలేసింది. ఈ కమిటీ గురువారం తన సిఫారసులతో టీఎస్‌పీఎస్సీకి నివేదిక సమర్పించింది. ప్రస్తుతానికి సంస్కరణలను తాత్కాలికంగా వాయిదా వేయాలని సూచించింది. నిజానికి గ్రూప్‌-2 ఎగ్జిక్యూటివ్‌ పోస్టులను గ్రూప్‌-1లో విలీనం చేస్తూ ఉమ్మడి రాష్ట్రంలో జీవో నెంబర్‌ 622 వెలువడింది. అయితే… దీని అమలు మాత్రం నిలిపివేశారు. 2014 నుంచి అమలు చేయాలని నిర్ణయించుకున్నప్పటికీ… ఉద్యమాలు, ఎన్నికలు, రాష్ట్ర విభజన తదితర అంశాల నేపథ్యంలో ‘విలీనం’ ఉత్తర్వులు అమలు కాలేదు. ఇప్పుడు… తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరోమారు ఈ అంశం తెరపైకి వచ్చింది. సిలబ్‌సలో మార్పు చేర్పులు సహా తెలంగాణ […]

    Continue Reading ...
  • ఆదాయం పెంచితే ఇస్తాపీఆర్సీ

    మాస్ న్యూస్: ‘పీఆర్సీ ఎంతిస్తామనే విషయం మీకు చెప్పానా? రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని, డబ్బు లేదని చెబుతూనే ఉన్నాను. నేనొకటి చెబితే బయటకెళ్లి మీడియాకు మరొకటి చెబుతారా? నా దగ్గర ఒకటి మాట్లాడి, బయటకెళ్లి మరొకటి మాట్లాడతారా?’ అంటూ ఉద్యోగ సంఘాల నేతలపై ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మీరు కోరినంత పీఆర్సీ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. పీఆర్సీతోపాటు ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు గురువారం సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలు సీఎంని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముందు మీ పనితీరు మెరుగుపరుచుకోండి.. నా అంచనాలకు తగ్గట్టు మీ పనితీరు లేదు. బాగా పనిచేసి రాష్ట్ర ఆదాయాన్ని పెంచండి, అప్పుడు మీ జీతాలు పెంచుతాం’ అంటూ సూచించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉందని, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఉద్యోగుల నుంచి తాను ఆశించిన రీతిలో సహకారం అందడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. 1999లో మీరు […]

    Continue Reading ...
  • లేడీస్ అండ్ జెంటిల్ మెన్

    మాస్ న్యూస్:’స్నేహగీతం’ సినిమాతో దర్శకుడిగా మారిన మధుర శ్రీధర్ గత యేడాది ‘మాయ’ మూవీతో ప్రొడ్యూసర్ అయ్యారు. అయితే ఆ సినిమా ఆయన్ని నిరాశకు గురిచేసింది. కాగా తన మిత్రులతో కలిసి శ్రీధర్ నిర్మించిన తాజా చిత్రం ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ విజయాన్ని సాధించింది. ‘స్నేహగీతం’ తర్వాత దక్కిన సక్సెస్ ఇదేనని శ్రీధర్ చెబుతున్నారు. సోషల్ మీడియా యువతపై ఎలాంటి ప్రభావం చూపుతోంది? కుటుంబ సభ్యుల మధ్య అది ఎలాంటి దూరాన్ని పెంచుతోంది? అనే అంశాన్నే ఇందులో ప్రధానంగా చర్చించారు. ఇది విషాదాంతమైన చిత్రమే అయినా… ప్రేక్షకులు కథతో కనెక్ట్ అయి ఆదరించడం ఆనందంగా ఉందంటున్నారు శ్రీధర్. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వాయిస్ ఓవర్ ఇచ్చిన ఈ సినిమా రిలీజ్ కు ముందే బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ మహేశ్ భట్ ‘ఇది బోల్డ్ అటెమ్ట్’ అంటూ ప్రశంసలు అందించడం విశేషం.

    Continue Reading ...
  • విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి పనులను వేగవం తంగా చేస్తా-ముఖ్యమంత్రి

    మాస్ న్యూస్: హైదరాబాద్‌ నగరాన్ని విశ్వ నగరంగా తీర్చిదిద్దడానికి శస్త్ర చికిత్సవలె పనులను వేగవం తంగా పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు పేర్కొ న్నారు. దీనికోసం రూ.10వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తా మని పేర్కొన్నారు. బుధవారం టీ న్యూస్‌ ఛానల్‌ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టనున్న పలు పథకాలను ఆయన వివరించారు. ట్రాఫిక్‌ను నియంత్రించడానికి నగరంలోని పలుప్రాంతాల్లో ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని కేసీఆర్‌ చెప్పారు. ముఖాముఖి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. నగరంలో ప్రవేశించేందుకు ఐదు స్కైవేలు జిల్లాల నుంచి నగరంలోకి ప్రవేశించేందుకు ఐదు స్కైవె లు నిర్మిస్తారు. ప్రస్తుతం మెహిదిపట్నం నుంచి శంషాబాద్‌ వరకు ఉన్న పివి నరసింహారావు ఎక్స్‌ప్రెస్‌ హైవే వలె ఈ మార్గా లు నిర్మిస్తారు. జూబ్లిd బస్‌ స్టాండ్‌ నుంచి తూముకుంట వరకు ఒక స్కైవే నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. పేద ప్రజల ఇళ్ల క్రమబద్ధీకరణ పేద ప్రజల […]

    Continue Reading ...
  • హైదరాబాద్‌ మహానగరంలో అమెజాన్‌ రంగప్రవేశం

    మాస్ న్యూస్: హైదరాబాద్‌ మహానగరంలో అమెజాన్‌ రంగప్రవేశం చేయబోతోంది. హైదరాబాద్‌లో అతి పెద్ద గోదాముల నిర్మాణం చేపట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. ఈ గోదాముల నిర్మాణానికి భూమిని లీజు పద్దతిలో తీసుకోనున్నట్లు తెలిసింది. రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయ నున్నట్లు ఆ కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అమెజాన్‌ కంపెనీకి రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆన్‌లైన్‌ వాణిజ్యంపై అమెజాన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ వాణిజ్యం ద్వారా ఏ విధంగా ఆదాయాన్ని పొందవచ్చునో ఆ సంస్థలకు అవగాహన కల్పించ నుంది.. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటి ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ రాష్ట్రంలో కూడా చేతివృత్తుల ఉత్పత్తులను కూడా అమెజాన్‌ వేదికగా ఆన్‌లైన్‌లో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు […]

    Continue Reading ...
  • తాడ్వాయి మండలంలో మేడారం సమ్మక్క- సారలమ్మ పండుగ

    మాస్ న్యూస్: వరంగల్‌ జిల్లాలోని తాడ్వాయి మండలంలో గల రాష్ట్రపండుగ మేడారం సమ్మక్క- సారలమ్మ మండమెలిగే పండుగ బుధవారం వైభవంగా ప్రారంభమైంది. రెండేళ్లకోసారి జరిగే ప్రధాన జాతర తర్వాత వచ్చే మాఘశుద్ధ పౌర్ణమి ఘడియల్లో వనదేవతలకు సాంప్రదాయ పూజలు జరపడం ఆదివాసీల ఆచారం. ఇందులో భాగంగా మొదటిరోజున కన్నెపెల్లిలోని సారలమ్మ దేవాలయంలో ప్రధాన పూజారి కాక సారయ్య ఆధ్వర్యంలో పూజారులు తల్లుల పూజా సామగ్రిని శుద్ధిచేసి అలుకుపూతలతో అలంకరించారు. వనదేవతల గద్దెలున్న మేడారం గ్రామంచుట్టూ సిద్ధబోయిన, కొక్కెర, చంద వంశీయులు రక్షా తోరణాలు కట్టారు. డోలువాయిద్యాల నడుమ తరలివెళ్లిన పూజారులు జాతర సందర్భంగా ఎటు వంటి కీడు జరగవద్దని రక్ష కట్టారు. గ్రామదేవతకు ప్రత్యేక పూజలు చేశారు. ఊరట్టానికి చెందిన చర్ప వంశీయులు దేవతలకు శెలపెయ్యను సమ ర్పించి గద్దెల వద్ద పసుపుకుంకుమలు సమర్పించుకున్నారు. రాష్ట్రం నలుమూలలనుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లనుంచి సుమారు 10వేల మంది భక్తులు హాజర య్యారు. ఎస్పీ […]

    Continue Reading ...
  • ఆంధ్రప్రదేశ్‌లో నిధుల చెల్లింపుల వ్యవహారాలన్నీఇక ‘ఆన్‌లైన్‌’లోనే

    మాస్ న్యూస్: జీతభత్యాలు మొదలుకుని, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన నిధుల చెల్లింపుల వ్యవహారాలన్నీ ఆంధ్రప్రదేశ్‌లో ఇక ‘ఆన్‌లైన్‌’లోనే జరగనున్నాయి. చంద్రబాబు సర్కారు ఇందుకు సంబంధించిన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దశలవారీగా రాష్ట్రమంతటా ఈ విధానం ప్రవేశపెట్టనున్నారు. ముందుగా గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ‘ఆన్‌లైన్‌’ చెల్లింపుల విధానాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఈ నెలాఖరులోగా అమలు చేయనున్నారు. పైలెట్‌ ప్రాజెక్టు అమలు తీరును పరిశీలించిన అనంతరం మరింత సమర్ధంగా మే నెలలో మరో నాలుగు జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత దశలవారీగా రాష్ట్రమంతటా అమలు చేసే క్రమంలో కేంద్రీకృత విధానాన్ని అందుబాటులోకి తెస్తారు. ఇందుకు సంబంధించిన ‘సమగ్ర విత్త నిర్వహణ వ్యవస్థ (సీఎ్‌ఫఎంఎస్‌)’ విధానంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు, ఐటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ నిధుల మంజూరు, చెల్లింపుల ప్రక్రియ మొత్తం ఈ విధానంతో పారదర్శకంగా జరుగుతుందని, ముఖ్యమంత్రి స్థాయి నుంచి […]

    Continue Reading ...
  • మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి

    మాస్ న్యూస్:   ఢిల్లీలో మరో నాలుగు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మరోసారి పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోలు ధర లీటరుకు 2 రూపాయల 42 పైసలు, డీజిలు లీటరుకు 2 రూపాయల 25 పైసలు తగ్గనున్నాయి. తగ్గిన ధరలు మంగళవారం అర్ధరాత్రినుంచి అమలులోకి వచ్చాయి. దీంతో ఢిల్లీలో పెట్రోలు ధర ఇంతకు ముందు 58 రూపాయల 91 పైసలుండగా, ఇప్పుడు 56 రూపాయల 49 పైసలకు చేరుకుంటుంది. అలాగే డీజిలు ఇప్పుడు లీటరు 48 రూపాయల 26 పైసలుండగా అది 46 రూపాయల ఒక్క పైసాకు తగ్గుతుంది. కోల్‌కతాలో పెట్రోలు లీటరుకు రూ.64.60, ముంబయిలో రూ. 63.90, చెన్నైలో రూ. 58.88 అవుతుంది. డీజిలు కోల్‌కతాలో రూ.50.99, ముంబయిలో రూ.52.99, చెన్నైలో రూ. 48.91 ఉంటుంది. గత ఆగస్టునుంచి పెట్రోలు ధర తగ్గడం ఇది వరసగా పదోసారి కాగా, గత అక్టోబర్‌నుంచి టీజిలు ధర తగ్గడం ఆరోసారి. మామూలుగా […]

    Continue Reading ...
  • భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి కామెంటేటర్ అమితాబ్

    మాస్ న్యూస్: ఐసిసి ప్రపంచ కప్ టోర్నమెంట్‌లో భాగంగా ఈ నెల 15న క్రికెట్ అభిమానులంతా నరాలు బిగబట్టి ఉత్కంఠగా చూసే భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌కి బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ తొలిసారిగా కామెంటేటర్ అవతారమెత్తనున్నాడు. త్వరలో విడుదలవుతున్న తన సినిమా ‘షమితాబ్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా అమితాబ్ ఈ మ్యాచ్‌కి కామెంటరీ చేయనున్నాడు. భారత్‌లోని కోట్లాది మందిలాగానే క్రికెట్ అధిమాని అయిన అమితాబ్ ఈ నెల 15న జరగబోయే ఈ మ్యాచ్‌కి కామెంట్రీ చెప్పే అవకాశం రావడంపట్ల 72 ఏళ్ల బిగ్ బీ ఉబ్బి తబ్బిబ్బవుతున్నారు. ఐసిసి ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ అయిన భారత్ పాకిస్తాన్ చేతిలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే ఏ మ్యాచ్ అయినా సరే నరాలు తెగిపోయే ఉత్కంఠను కలిగిస్తుందనేది వేరే చెప్పాల్సిన పని లేదు. అయితే కామెంట్రీ బాక్స్‌లో తాను భారత్‌కు అనుకూలంగానే వ్యవహరించే అవకాశం […]

    Continue Reading ...