అమలా సెకండ్ ఇన్నింగ్స్
మాస్ న్యూస్: తమిళంలో తక్కువ కాలంలోనే హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమలాపాల్ ఈమధ్యే దర్శకుడు విజయ్ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న అమలాపై కొత్త కొత్త రూమర్లు కోలీవుడ్లో సందడి చేస్తున్నాయి. ప్రస్తుతం ఆమె గర్భవతి అని, కొత్త ఏడాదిలో ఆమె భర్త విజయ్ అమూల్యమైన బహుమతులు అందించాడంటూ మీడియా కోడై కూస్తోంది. దీనిపై స్పందించిన అమలాపాల్ తాను నూతన సంవత్సర వేడుకల్ని ఘనంగా జరుపుకున్నానని చెబుతూనే, తాను గర్భవతినని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజంలేదని చెబుతోంది. తప్పకుండా ఆ విషయాన్ని అందరికీ తెలియజేస్తానని, అందులో దాపరికం ఏంలేదని అంటోంది కూడా. త్వరలోనే అమలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
Tagged with:
actress Allari naresh amalapal second innings buissiness cherry chiranjeevi colours filim news filmnews gopi chand heroins hindi actress kartika kcr massnews samantaa telugu filims telugunews tollywood
Leave a reply
You must be logged in to post a comment.