Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

వాగుకు మోక్షమెప్పుడో

మాస్ న్యూస్ : భద్రది కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల పరిధిలో గల తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లో ఉన్న వాగు పై వంతెన లేక గత ఎన్నో ఏళ్ళు గా గిరిజన గ్రామాల ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు వాగు పై వంతెన విషయం పై ప్రజా ప్రతినిధులుకు ప్రభుత్వ అధికారులు కు పలు మార్లు విన్నవించుకున్న ఫలితం లేకపోయింది అని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తంచేశారు, మొదటి వానకు వాగు ఇంతలా పొంగితే వాన కాలం మొత్తం మా బాధలు వర్ణనాతీతం అని వాపోతున్నారు కావున ప్రజా ప్రతినిధులు అధికారులు చొరవ తీసుకుని వంతెన నిర్మాణం చేపట్టాలని కోరారు గత సంవత్సరం వంతెనకు ప్రతి పదనలు పంపారని వంతెన నిర్మాణం చెప్పటక పోవటం పై కూడా వారు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ వాగు పై వంతెన లేక పోవడంతో కొన్ని గిరిజన గ్రామాల ప్రజలు వర్ష […]

Continue Reading ...
  • హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు రెమ్‌డెసివర్‌ తీసుకోవద్దు : ఎయిమ్స్‌ వైద్యులు

    మాస్ న్యూస్ – ఢిల్లీ : కరోనా చికిత్స కోసం వినియోగించే ఔషధాల కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా రెమ్‌డెసివర్‌ దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు రెమ్‌డెసివర్‌ తీసుకోవద్దని ఎయిమ్స్‌ వైద్యులు సూచిస్తున్నారు. కొవిడ్‌ పేషెంట్ల కోసం ‘మెడికేషన్‌ అండ్‌ కేర్‌ ఇన్‌ హోం ఐసోలేషన్‌’ అనే వెబినార్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య నిపుణులు అనేక సలహాలిచ్చారు. ‘హోం ఐసోలేషన్‌లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ రెమ్‌డెసివర్‌ తీసుకొవద్దు. సానుకూల దృక్పథం, వ్యాయాయం అవసరం’ అని డాక్టర్‌ నీరజ్‌ నిష్కల్‌ తెలిపారు. 80శాతం కరోనా బాధితులు చాలా స్వల్ప లక్షణాలతో మాత్రమే బాధపడుతున్నారని, మొదటిసారి ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలో నెగెటివ్‌ రిపోర్ట్‌ వస్తే మరోసారి పరీక్ష చేయించుకోవాలని సూచించారు. సరైన సమయంలో సరైన మోతాదులో మందులు వేసుకోవాలని తెలిపారు. 94శాతం కన్నా తక్కువ ఆక్సిజన్‌ స్థాయులు నమోదవడం, ఇతర తీవ్ర వ్యాధులతో […]

    Continue Reading ...
  • ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా పంపిణీ : TRS పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు

    మాస్ న్యూస్ : కొత్తగూడెం మున్సిపాలిటీలోని 33 వ వార్డులో ముస్లిం సోదరులు మరియు సోదరీమణులకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు వనమా రాఘవేంద్ర రావు.ఈ సందర్భంగా వనమా రాఘవ మాట్లాడుతూ అల్లా దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలని, కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ రంజాన్ పండుగ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు రావి రాంబాబు, sk. అన్వర్ పాషా, వెంకటేశ్వర్లు, హైమత్, సదానందం, రాజేష్, పండు, అబ్దుల్ రహీం, రావి సాయి మరియు ముస్లిం సోదరీ సోదరీమణులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలంతా ముందు జాగ్రత్తగా నిత్యవసర వస్తువులను మంగళవారం కొనుగోలు చేశారు. దీంతో ఆ రోజు మార్కెట్‌ మొత్తం రద్దీగా కనబడింది. లాక్‌ డౌన్‌ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండడంతో కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చారు. కొత్తగూడెం డి.ఎస్‌.పి వెంకటేష్‌ బాబు నేతృత్వంలో ఆయా సర్కిల్‌ ఇన్స్పెక్టర్ లు వారి వారి పరిధిలో లాక్‌ డౌన్‌ అమలకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ప్రధాన రహదారుల వెంబడి బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. సబ్‌ ఇన్స్పెక్టర్లు ఆయా ఏరియాలలో వాహనాలపై పెట్రోలింగ్‌ చేస్తూ […]

    Continue Reading ...
  • సానిటేషన్, మనోధైర్యం కల్పించిన వార్డ్ కౌన్సిలర్

    మాస్ న్యూస్ : మేదర బస్తీ 19 వ వార్డులో కొత్తగా రెండు కరోనా పాజిటివ్ కేసులు రావడంతో వార్డు కౌన్సిలర్ బండి నరసింహారావు వెంటనే స్పందించి ఈరోజు వారి ఇంటికి మరియు ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడరు చల్లిచడం జరిగింది. మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సామాజిక దూరాన్ని పాటిస్తూ మాస్కులు మరియు శానిటైజర్ తప్పకుండా వాడ వలసిందిగా కోరుతూ పాజిటివ్ వచ్చిన వారికి ధైర్యం చెప్పడం జరిగింది. మాస్ న్యూస్ రిపోర్టర్ కనక రాజు.

    Continue Reading ...
  • కరోనా తీవ్రతరం దృష్ట్యా జిల్లా ప్రజలకు శుభవార్త అందించిన మంత్రి హరీష్ రావు

    మాస్ న్యూస్ : కరోనా మహమ్మారితో ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న సందర్భంగా.. కరోనా దృష్ట్యా సిద్దిపేట జిల్లా ప్రజానికానికి మంత్రి హరీష్ రావు గారు శుభవార్త అందించారు.. కరోనా తీవ్రంగా ఉన్న సందర్భంగా జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళశాల ఆసుపత్రి,RVM, సురభి మెడికల్ కళాశాలలో కరోనా భారిన పడిన వారికి మెరుగైన వైద్యం అందించే క్రమం తో పాటు మౌళిక వసతులు, కరోనా నివారణ చర్యలు నిత్యం స్వయంగా మంత్రి హరీష్ రావు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్న సందర్భంగా భవిష్యత్ దృష్ట్యా ఆక్సిజన్ నిత్యం అందుబాటులో ఉండే విధంగా ఆక్సిజన్ ప్లాంట్లు( ఆక్సిజన్ తయారీ కేంద్రాలు) ” ఏర్పాటు చేయనున్నారు.. సిద్దిపేట జిల్లాలో గజ్వేల్, సిద్దిపేట జిల్లా కేంద్రంలో, సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రంలో, జోగిపేట లో ఈ ప్లాంట్స్ ఏర్పాటు కు ఈరోజు స్థల సేకరణకు జాతీయ రహదారుల శాఖ నుండి ప్రత్యేక బృందం సిద్దిపేట కు వచ్చారు..వారం […]

    Continue Reading ...
  • చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు

    మాస్ న్యూస్ : చండూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క 72వ జన్మదిన వేడుకల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బొబ్బిలి శ్రీనివాస్ రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు ,నాయకులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • యుద్ధ ప్రాతిపదికన తుంగభద్ర నది పుష్కర స్నానాలకు ప్రభుత్వం ఏర్పాటు చేయాలి : కె.నరసింహులు

    అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన అలంపురం జోగులాంబ దేవి దేవస్థానంలో రాబోయే 20 -11 -2020 తేదీ తుంగభద్రా నది పుష్కరాలు మొదలు కాబోతున్నాయి. మాస్ న్యూస్: తెలంగాణ రాష్ట్రంలోనే కేవలం అల్లంపూర్ నియోజకవర్గం లో మాత్రమే తుంగభద్రా నది ప్రవహిస్తుంది ఇంతటి ప్రాముఖ్యం కలిగినటువంటి తుంగభద్ర పుష్కరాలను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించడానికి ముందుకు రాకపోవడం నిధులు కేటాయించకపోవడం పుష్కర ఘాట్ లకు మరమ్మత్తులు చేయకపోవడం దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం రోడ్లను అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటుగా భావిస్తున్నాం స్థానికంగా ఉండే ప్రజా ప్రతినిధి గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ వి.ఎం అబ్రహం గారు కూడా పుష్కరాల గురించి ఇప్పటి వరకు ఏమీ మాట్లాడక పోవడం ప్రజల (హిందువుల) మనోభావాలను గుర్తించకపోవడం అల్లంపూర్ తాలూకా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ఒప్పించి పుష్కర ఏర్పాటు చేయాల్సిన బాధ్యత స్థానిక ఎమ్మెల్యే పై ఉందని గుర్తు చేస్తూ వెంటనే యుద్ధ ప్రాతిపదికన తుంగభద్ర నది పుష్కర […]

    Continue Reading ...
  • పుష్కర ఘాటులను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ కృష్ణ, డి.ఎస్.పి యాదగిరి

    మాస్ న్యూస్ : రాజోలి మండల కేంద్రంలో అతి పురాతనమైన శ్రీ లక్ష్మీ వైకుంట నారాయణస్వామి ఆవరణలో గత పుష్కరాలకు ఏర్పాటు చేసిన పుష్కర ఘాట్ లను అడిషనల్ SP కృష్ణ, DSP యాదగిరి, CI వెంకటేశ్వర్లు, SB సీఐ రాజేంద్ర రెడ్డి పరిశీలించడం జరిగింది. పుష్కరాలకు సంబంధించి వచ్చే భక్తులను వారి సౌకర్యాలపై రాజోలి SI శ్రీనివాసులు, ఉప సర్పంచ్ గోపాల్ గార్లను అడిగి తెలుసుకోవడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్కింగ్ స్థలాల ఏర్పాటుపై పరిశీలించడం జరిగింది. గ్రామంలో ప్రతి ఒక్కరు అధికారులకు సహకరిస్తూ పుష్కరాలను జరుపుకోవాలని అడిషనల్ ఎస్ పి కృష్ణ తెలిపారు. రాజోలి లో ఉన్న 2 ఘాట్లను ఉపయోగించుకునే విధంగా పనులు చేపట్టాలని తెలిపారు. గ్రామ పంచాయితీ తరపున పూర్తి సహకారాలు అందిస్తామని రాజోలి గ్రామ ఉపసర్పంచ్ గోపాల్ అధికారులకు తెలిపారు.

    Continue Reading ...
  • కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు సంతకాల సేకరణ

    మాస్ న్యూస్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక కార్యక్రమాలను వ్యతిరేకిస్తూ రైతు సంతకాల సేకరణ కార్యక్రమం ఈరోజు ఐజ మండలం ఉప్పల గ్రామం లో రైతుల సంతకాల సేకరణను మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఉప్పల గ్రామానికి చెందిన రైతులు అందరు కూడా భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ సంతకాలు చేశారు . ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో రైతులను నామరూపాల్లేకుండా చేసి రైతు వ్యవస్థను విచ్చిన్నం చేసి వ్యవసాయన్ని వ్యాపారుల చేతులకు అప్పజెప్పి రైతులను కూలీలుగా మార్చే చట్టాలను రూపొందిస్తుంది అన్నారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర కల్పించక , సకాలంలో పండించిన పంటను కొనక ,రైతుల నడ్డివిరిచే ప్రయత్నం చేస్తుంది. పండించిన […]

    Continue Reading ...
  • 2వ డోస్ కోసం కనీసం 12-16 వారాల వ్యవధి ఉండాలి

    మాస్ న్యూస్ – కొత్తగూడెం : డైరెక్టర్ ఆఫ్ హెల్త్, తెలంగాణ గారి ఆదేశాల మేరకు BV కోవిషీల్డ్ వాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న వారు 2వ డోస్ కోసం కనీసం 12-16 వారాల వ్యవధి ఉండాలన్న నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు cowin.gov. in వెబ్ సైట్లో తదనుగుణంగా మార్పులు చేయుట కోసం తేదీ: 15.05.2021 మరియు 16.05.2021 నాడు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ టీకాల కార్యక్రమం నిలిపి వేయబడతాయి. తేదీ:17.05.2021 నుండి యధావిధిగా టీకాల కార్యక్రమం జరుగును. జరుగుతుంది కావున ప్రజలు సహకరించగలరని డా.నాగేంద్ర ప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి తెలియజేశారు.

    Continue Reading ...
  • అధికారులతో సమీక్ష సమావేశం : ఎమ్మెల్యే వనమా

    కొత్తగూడెం నియోజకవర్గం లోనీ కరోనా ప్రభావం పరిస్థితులపై మరియు లాక్ డౌన్ విషయంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వనమా మాస్ న్యూస్ : కొత్తగూడెం నియోజకవర్గం లోని కరోనా ప్రభవం పరిస్థితులపై మరియు లాక్ డౌన్  విషయంపై వైద్య విధాన శాఖ అధికారులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్యాధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సమీక్ష సమావేశంలోని  ముఖ్యాంశాలు. శానిటేషన్ పనులు బాగా చేయాలి. ఇంటింటి సర్వే కార్యక్రమం సరిగా అమలు అయ్యేలా చూడాలి. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఎలా చర్యలు తీసుకోవాలని. కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని. రెమిడీస్ సీవర్ ఇంజక్షన్ అందుబాటులో  ఉండేలా చూసుకోవాలని. హోమ్ స్లోషన్ లో ఉన్నవారికి కోవిడీ కిట్లు అందజేయాలని. పట్టణాల్లో, గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్ […]

    Continue Reading ...
  • అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు : జలగం వెంకటరావు

    మాస్ న్యూస్ : రోగులకు వైద్యులు ఇచ్చే ఔషధం, ఎంతముఖ్యమో… నర్సులు చేసే సేవలు కూడా అంతే ముఖ్యం… నర్సు వృత్తికి మార్గదర్శకమైన “ఫ్లోరెన్స్ నైటింగేల్” 1954లో క్రిమియా యుద్ధంలో టర్కీలో గాయపడిన సైనికులకు చేసిన సేవలకు గుర్తుగా ఆమె జన్మదినమైన ఈ రోజున నర్సుల దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ కరోనా నేపథ్యంలో ప్రాణాలను లెక్కచేయకుండా మీరు చేస్తున్న సేవలు ఎంతో గొప్పవి అని ప్రతి ఒక్కరికి పేరు పేరునా హృదయపూర్వక అంతర్జాతీయ నర్సుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన జలగం వెంకటరావు మాజీ ఎమ్మెల్యే, కొత్తగూడెం నియోజకవర్గం.

    Continue Reading ...
  • టీకా కేంద్రాన్ని పరిశీలించిన బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు కోనేరు సత్యనారాయణ (చిన్ని) మంగళవారం రోజు పాత కొత్తగూడెం నందు ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ (UPH) ని పరిశీలించడం జరిగింది. అనంతరం టీకా వేయించుకోవడానికి వచ్చిన ప్రజలకి ఏమైనా ఇబ్బందులు కల్గుతున్నాయా ప్రత్యకంగా అని అడిగి తెలుసుకున్నారు. ప్రజలందరూ హాస్పిటల్ సిబ్బందికి సహకరించి, భౌతిక దూరం పాటిస్తూ త్వరగా టీకా వేసుకోవాలని కోరడం జరిగింది. ప్రజలందరూ టీకా వేసుకొని కరోనాని తరిమికొట్టాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పొన్నెకంటి రాజుని కోనేరు సత్యనారాయణ (చిన్ని) అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ వెంకన్న, పొన్నెకంటి రాజు మరియు పాలురువు స్థానికులు పాల్గొన్నారు…

    Continue Reading ...
  • 14 వరకు మొదటి డోసు వ్యాక్సిన్ నిలిపివేత

    మాస్ న్యూస్ : తెలంగాణ‌ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ప్ర‌భుత్వం 45సంవ‌త్స‌రాల పైబ‌డిన వారికి మాత్ర‌మే వ్యాక్సిన్ ఇస్తునప్పటికీ కేంద్రం నుండి వ‌స్తున్న డోసులు స‌రిపోవ‌టం లేదు. దీంతో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. సెకండ్ డోసు వ్యాక్సిన్ తీసుకునే వారికి స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డిన కారణంగా, వారికి ప్రాధాన్య‌త ఇస్తూ, ఫ‌స్ట్ డోసును తాత్కాలికంగా నిలిపివేస్తున్న‌ట్లు వైద్య ఆరోగ్య‌శాఖ ప్ర‌క‌టించింది. సెకండ్ డోసు వారికి స‌మ‌యం మించిపోకుండా ఉండాల‌న్న ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సెకండ్ డోసు తీసుకోవాల్సిన వారు 11ల‌క్ష‌ల మంది ఉన్న‌ట్లు సమాచారం. ఈ కారణంగా ఈ నెల 15 వ తేదీ వ‌ర‌కు ఫ‌స్ట్ డోసును ఆపివేస్తున్నటు ప్రకటించింది.

    Continue Reading ...
  • రాజీనామా చేసి పార్టీ మారాలి

    మాస్ న్యూస్ : సుజాత రామకృష్ణ రెడ్డి మున్సిపల్ వడ్డేపల్లి రాజకీయంలో దోబూచులాట జరుగుతున్న తరుణంలో… అధికారంలో ఉన్న పార్టీ నాయకులు కల్ల బొల్లి మాటలకు మోసపోయి, ఒక పార్టీలో గెలిచి, ఇంకో పార్టీలో చేరడం భావ్యం కాదు అని, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సుజాత రామకృష్ణ రెడ్డి అన్నారు. దమ్ము ధైర్యం ఉంటే గెలిచిన పార్టీకి రాజీనామా చేస, మారిన పార్టీ గుర్తుపై గెలిచి తీరితే, సంతోషిస్తామని వడ్డేపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బంగారు రామకృష్ణా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆర్.ఎస్. కరుణ శ్రీ ధనలక్ష్మి, లలిత, మాణిక్య తోట రవి లకు గురువారం పార్టీ తరఫున సవాలు విసిరారు. ఇలాంటి నీచమైన రాజకీయాలు భవిష్యత్తులో ఎప్పుడు చేయకూడదని, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దే నాయకులకు తనను నమ్మి ఓటు వేసిన ప్రజలు తగిన సమయంలో మీకు బుద్ధి చెబుతారని, ఇది కొంతకాలమే నని ఆయన ఈ […]

    Continue Reading ...
  • చిన్నారి పాప కు చేయూత

    మాస్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వడ్డేపల్లి మండల యువ నాయకుడు చరణ్ తన కుమారుడు మురారి రెడ్డి మొదటి జన్మదినం ను పురస్కరించుకొని శాంతినగర్ మున్సిపాలిటీ పరిధిలోని జమ్మలమడుగు కాలనీ కి చెందిన మాలిక్ కుమార్తె ఫారిహ (3 సంవత్సరాలు) కోచర్ వ్యాధి తో పడుతున్నందుకు, ఆ పాప వైద్య ఖర్చుల కొరకు, తన స్వగృహంలో 10/11/2020 మంగళవారం మురారి రెడ్డి చేతుల మీదుగా రూ 10,000=00 అందించారు. చరణ్ తన కుమారుని పుట్టినరోజు సందర్భంగా ఇలా ఆర్ధిక సహాయం అందించినందుకు మాలిక్ కృతజ్ఞతలు తెలిపారు. చరణ్ సేవా గుణము ను స్థానికులు అభినందించారు.

    Continue Reading ...
  • తృతిలో తప్పింన ప్రమాదం

    మాస్ న్యూస్ : జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికలపాడు గ్రామంలో ఈరోజు ఉదయం 8:30 సమయములో గద్వాల ఆరగిద్ద గట్టు పెంచికలపాడు వెళ్లే RTC బస్సు ఈరోజు పెంచికలపాడు గ్రామంలో బస్టాండ్ లో రివర్స్ వెళ్ళు కరెంటు స్తంభానికి గుద్దడం జరిగినది. స్తంభం విరిగి కింద పడడం జరిగినది తృతిలో ప్రమాదం తప్పింది 40 మంది దాకా సురక్షితంగా బయటపడ్డారు. పెంచికలపాడు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్ శశికళ, గ్రామ ప్రజలు, కరెంటు అధికారులు రావడం సహాయక చర్యలు చేపట్టి బస్సుని పంపడం జరిగినది. ఇలాంటి ఘటనలు కాకుండ చూసుకోవాలని అధికారులను కోరుతున్నారు.

    Continue Reading ...
  • బిజెపి కార్యకర్త శ్రీనివాస్ మృతి బాధ కరం : బిజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రరెడ్డి

    మాస్ న్యూస్: భారతీయ జనతా పార్టీ కార్యకర్త గంగల శ్రీనివాస్ మరణం తెలంగాణ లో ఎంతో మంది ని బాధించిందనీ రామచంద్ర రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్ట్, మరియు టీఆర్ఎస్ నిరంకుశ, నియంతృత్వ పాలనకు మనస్తాపం చెంది గత ఆదివారం నవంబర్ 1న ఆత్మహత్యకు యత్నించిన గంగల శ్రీనివాస్ నిన్న రాత్రి చనిపోవడం జరిగింది. అందుకు గాను ఈ రోజు జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో శ్రీనివాస్  నివాళుఅర్పించారు. కార్యకర్తలెవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని బ్రతికుండి పోరాటం చేయాలని సూచించారు.

    Continue Reading ...
  • అధికారులు విద్యుత్ స్తంభాల దుస్థితిపై జర ఓ లుక్ వేయండి

    మాస్ న్యూస్ : గద్వాల్ పట్టణంలోని 32 వార్డ్ చింతలపేటలో గతంలో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు ఏకంగా ఇండ్లపై ఒరిగి దర్శనమిస్తున్నాయి. బలమైన గాలులు వీస్తే ఏ క్షణంలోనైనా కింద పడే అవకాశం లేకపోలేదు. దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఇటీవలే కురిసిన వర్షాలకు స్తంభంపై తేమ అలాగే ఉండి ప్రక్కనే ఉన్న ఇంటిలోకి కరెంట్ ప్రసరించింది.ఆ ఇంటిలోని వారు తృటిలో ప్రమాదం నుండి బయటపడ్డారు. స్తంభం తమ ఇంటికి ఆనుకొని ఉండటం తాము మృత్యువుతో సావాసం చేస్తున్నట్టు ఉంది అని ఆ ఇంట్లోని వారు వాపోతున్నారు. ఇక అదే వార్డ్ లో ఆంజనేయ స్వామి ఆలయం మార్గంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ సమీపంలో చెత్తను రోడ్డుపైనే వేస్తున్నారు. రోడ్డుపై అటుగా వెళ్ళే వారికి దుర్గంధ భరితమైన వాసన వస్తుందని బాటసారులు తమ ఇబ్బందిని తెలిపారు. అలాగే ట్రాన్స్ఫార్మర్ రోడ్డుకు అనుకోని ఉండటం మూలాన […]

    Continue Reading ...