Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
  • క్రికెట్ ఆటలో రాజకీయాలెందుకు-సుప్రీం

    మాస్ న్యూస్: ఫిక్సింగ్‌, బెట్టింగ్‌లను ఇలాగే కొనసాగించి క్రికెట్‌ను చంపేస్తున్నారని బిసిసిఐపై సుప్రీంకోర్టు మండిపడింది. క్రికెట్‌ను ఆరాధించే దేశంలో..క్రీడా స్ఫూర్తి, జెంటిల్‌మెన్‌ గేమ్‌ని ఉండనీయ్యండి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తొలగింపబడిన బిసిసిఐ బాస్‌ శ్రీనివాసన్‌పైనా కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ముద్గల్‌ కమిటీ శ్రీనికి క్లీన్‌చిట్‌ ఇవ్వలేదనీ, స్వయానా అతడి యాజమాన్యంలోని జట్టు, సన్నిహితులు ఫిక్సింగ్‌లో ఉన్నప్పుడు విచారణ నుంచి ఆయన తప్పుకోజాలరని పేర్కొంది. అధ్యక్షుడిగా ఉంటూ కాసుల లీగ్‌ ఐపీఎల్‌లో జట్టును కలిగి ఉండటంపైనా శ్రీనిని ధర్మాసనం ఎండగట్టింది. గేమ్‌ నిర్వహణ, ఫిక్సింగ్‌, బెట్టింగ్‌ వంటి వాటిని ఆటకు దూరంగా ఉంచటమే బిసిసిఐ విధి. అన్ని జట్లకు సమాన అవకాశాలు కల్పించాల్సిన అధ్యక్ష స్థానం అనుమాస్పదంగా ఉంది. గేమ్‌ వాస్తవ రూపంలోనే ఆడాలి అని తెలిపింది.

    Continue Reading ...
  • బీహార్‌ రాజకీయాల్లో హైడ్రామా

    మాస్ న్యూస్: ఒకవైపు బీహార్‌ ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ! మరోపక్క 97మంది ఎమ్మెల్యేలతో జేడీ(యూ)శాసనసభాపక్ష సమావేశం! అసెంబ్లీని రద్దు చేయాలంటూ మాంఝీ సిఫారసు! మాంఝీని పార్టీనుంచి తొలగిస్తూ జేడీ(యూ)నిర్ణయం..శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్‌ ఎన్నిక! బీహార్‌ రాజకీయాల్లో శనివారం హైడ్రామా నడిచింది. ఉత్కంఠ పరిస్థితుల మధ్య జనతాదళ్‌ యునైటెడ్‌ శాసనసభాపక్ష నేతగా నితీశ్‌కుమార్‌ ఎన్నికయ్యారు. మరోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్డడానికి సన్నద్ధమయ్యారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ప్రస్తుత ముఖ్యమంత్రి మాంఝీపై బహిష్కరణ వేటు వేశారు. పార్టీ చీఫ్‌ శరద్‌ యాదవ్‌ ఆదేశాలమేరకు మొత్తం 111మంది పార్టీ ఎమ్మెల్యేల్లో 97 మంది ఈ సమావేశానికి హాజరయ్యారు. వీరంతా ఏకగ్రీవంగా నితీశ్‌ను తమ నేతగా ఎన్నుకున్నారు. సీఎం మాంఝీ మద్దతుదారుడిగా గుర్తింపు పొందిన అరుణ్‌ మాంఝీ నితీశ్‌ పేరును ప్రతిపాదించారని మంత్రి శ్రావణ్‌ కుమార్‌ మీడియాకు వివరించారు. కాగా ఈ సమావేశానికి ప్రస్తుత ముఖ్యమంత్రి జితన్‌రామ్‌ మాంఝీ […]

    Continue Reading ...
  • మరో స్వర్ణ పతకం

    మాస్ న్యూస్ : భారత్‌ ఖాతాలో మరో స్వర్ణ పతకం వచ్చి చేరింది. ఆదివారం నాడు జరిగిన పురుషుల రెజ్లింగ్‌ 65 కిలోల ఫ్రీసై్టల్‌ విభాగంలో యోగేశ్వర్‌ దత్‌ స్వర్ణ పతకం దక్కింది. తజకిస్తాన్‌కు చెందిన జలిమ్‌ఖాన్‌ యుసుపొవ్‌పై విజయం సాదించిన యోగేశ్వర్‌ దత్‌ భారత పసిడి పతకాల సంఖ్య నాల్గుకు చేర్చాడు. లండన్‌ ఒలింపిక్‌‌సలో రజత పతకం సాధించిన యోగేశ్వర్‌ ప్రస్తుతం 28 సంవత్సరాల వయస్సులో మరో పతకం సాధించి భారత పతాకాన్ని రెపరెపలాడించాడు. ఈ విజయంతో ఆసియా క్రీడల్లోని పతకాల పట్టికలో భారత్‌ను టాప్‌-10లోకి తీసుకువచ్చాడు. (ప్రస్తుతం భారత్‌ 9వ స్థానంలో కొనసాగుతోంది. ఆసియా క్రీడల వేదికపై భారత్‌కు 28 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం దక్కినటై్టంది. రెజ్లింగ్‌లో ఆఖరి సారి 1986 సియోల్‌లో జరిగిన ఆసియా గేమ్‌‌సలో కర్తర్‌ సింగ్‌ భారత్‌కు పతకం అందించాడు.

    Continue Reading ...