Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్

బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్

మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(S) మండలంలో గిరిజన యువకుడు గూగులోత్ వీరశేఖర్ ను నిర్బంధించి చిత్రహింసలకు గురిచేసిన అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ సెంటర్ లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట కండ్లకు గంతలు కట్టుకొని, చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో బహుజనులపై ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ లపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని వారికి రక్షణ కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వం తూతుమంత్రంగా బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా మానవత్వం మరిచి ప్రవర్తించిన సంబంధిత అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని విధుల నుండి తొలగించాలని బాధితుడి కుటుంబానికి ప్రభుత్వం […]

Continue Reading ...
  • నకిలీ మిర్చి విత్తనాలు స్వాధీనం

    రూ.4,75,000/- విలువ గల అనధికార మిర్చి విత్తనాలను స్వాధీనం. మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : ఈరోజు మధ్యాహ్నం నమ్మదగిన సమాచారం మేరకు ఏడూళ్లబయ్యారం సీఐ దోమల రమేష్ మరియు పినపాక మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది దుగినేపల్లి గ్రామంలో బత్తుల లక్ష్మీనారాయణ, S/o.తిరుపతయ్య, వయస్సు : 58 yrs. అను వ్యక్తి ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా తన ఇంటిలో విత్తనాలను విక్రయిస్తున్నాడని సోదాలు నిర్వహించారు. ఇట్టి సోదాలలో 14.450 కిలోల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఏఎస్పీ శబరీష్ ఐపీఎస్ తెలియజేసారు. పట్టుబడిన అనధికార మిర్చి విత్తనాల విలువ 4,75,000/-ల రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ఇట్టి సోదాల్లో పట్టుబడిన వ్యక్తి బత్తుల లక్ష్మీనారాయణ మీద ఏడూళ్లబయ్యారం పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

    Continue Reading ...
  • ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసుశాఖ ప్రత్యేక శ్రద్ధ

    జిల్లా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లోని కోయ, గుత్తికోయ ప్రజలకు వాటర్ ఫిల్టర్లు, టీవీలు మరియు దోమ తెరలను పంపిణీ చేసిన పోలీసు అధికారులు. మాస్ న్యూస్ – కొత్తగూడెం జిల్లా : చర్ల మండలంలోని పులిగుండాల, కొండవాయి వలస ఆదివాసీ గుత్తి కోయ గ్రామాల్లో ఈ రోజు జిల్లా SP సునీల్ దత్ IPS ఆదేశాలతో చర్ల పోలీసులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రతీ కుటుంబానికి వాటర్ ఫిల్టర్, దోమ తెరలు, గ్రామానికో టీవీ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న OSD వి.తిరుపతి భద్రాచలం ASP డాక్టర్ వినీత్.జి, చర్ల ఇన్స్పెక్టర్ బి.అశోక్, CI రాజగోపాల్ మరియు SI రాజువర్మ ల చేతులు మీదుగా వీటిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో OSD తిరుపతి మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా SP సునిల్ దత్ IPS గారి ఆదేశాల మేరకు చర్ల పోలీసు స్టేషన్ పరిధిలోని […]

    Continue Reading ...
  • నాణ్యమైన మాంసం సరఫరా చేయబోతున్న ప్రభుత్వం

    మాస్ న్యూస్ : మన ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు ఇకపై మాంసం గురించి, దాని నాణ్యత గురించి చింతించవలసిన పనిలేదు. ప్రభుత్వమే మీఇంటి వద్దకు వాహనంలో మేకలు లేదా గొర్రెలను పంపి, అక్కడే వధించి నాణ్యమైన మాంసం సరఫరా చేయనుంది. ఇందుకోసం పశు సంవర్ధకశాఖ కసరత్తు చేస్తున్నది. దీనిపై హైదరాబాద్‌లోని జాతీయ మాంసం పరిశోధన కేంద్రం(NRCM) పరిశోధనలు చేస్తున్నది. ఇప్పటికే వాహనం నమూనా సిద్ధమైంది. త్వరలోనే ఈ ప్రయోగాన్ని ప్రభుత్వానికి నివేదించనున్నారు. మొబైల్‌ షీప్‌ స్లాటర్స్‌ విధానం అమల్లోకి వస్తే దేశంలోనే తొలిసారిగా ప్రయోగం చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలువనుంది. ఇప్పటికే పలు అంశాల్లో దేశానికి మార్గదర్శకంగా నిలిచిన తెలంగాణ,ఇప్పుడు మరో అంశంలోనూ మార్గదర్శిగా నిలువనున్నది. సరఫరా విధానంప్రస్తుతానికి మొబైల్‌ షీప్‌ స్లాటర్స్‌ను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డిమాండ్‌ను బట్టి ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తామని చెబుతున్నారు. ఈ విధానంలో.. శుభకార్యాలు జరుపుకొనేవారు చేసే ఆర్డర్‌ను బట్టి.. వారి […]

    Continue Reading ...
  • ఎమ్మెల్యే వనమా కృషి అమోఘం : జడ్పీ వైస్ చైర్మన్

    మాస్ న్యూస్ – లక్షిమిదేవిపల్లి : కొత్తగూడెం కి మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే వనమా చిత్రపటానికి పాలాభిషేకం చేసిన – జెడ్పీ వైస్ చైర్మన్, MPP, MPTC డైరెక్టర్ లు కొత్తగూడెం కు వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కి మెడికల్ కాలేజీ రావడానికి అహర్నిశలు కృషిచేసిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన జెడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, చుంచుపల్లి MPP శ్రీమతి బాదావత్ శాంతి మరియు MPTC శ్రీమతి అచ్చ నాగమణి .ఈ సందర్భంగా జడ్పీ వైస్ చైర్మన్ మాట్లాడుతూ కొత్తగూడెం అభివృద్ధి చేయాలంటే ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తోనే సాధ్యమని, ప్రజలకు చేసిన ప్రతి వాగ్దానాన్ని ఎమ్మెల్యే వనమా గారు నిలబెట్టుకుంటారు అని, కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ తీసుకురావడంలో ఎమ్మెల్యే వనమా కృషి అమోఘమని, […]

    Continue Reading ...
  • దశాబ్దాల కల

    మాస్ న్యూస్ : కొత్తగూడెంకు మెడికల్ కాలేజి మంజూర్ చేసిన CM KCR స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ ద్వారా వనమా కు తీపి కబురు. MLA వనమా కృషి తో ఫలించిన దశాబ్దాల కల. కొత్తగూడెం చరిత్రలో మరొక కలికితురాయి. భద్రాద్రి కొత్తగూడెం ప్రజల తరపున CM KCR, KTR లకు కృతజ్ఞతలు తెలిపిన వనమా.

    Continue Reading ...
  • అర్హులైన వారికి మాత్రమే కోవాక్సిన్ 2వ డోస్

    మాస్ న్యూస్ : సోమవారం (17.05.2021) రోజు భద్రాద్రి జిల్లాలో కోవాక్సిన్ వాక్సినేషన్ సెషన్ నిర్వహించబడుతుంది.  కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారికి మాత్రమే ఇవ్వబడుతుంది. మొదటి డోస్ ఎవరికి కోవాక్సిన్ ఇవ్వబడదు కోవాక్సిన్ 2వ డోస్ కోసం అర్హులైన వారు మొదటి డోస్ సర్టిఫికెట్ లేదా ఫోన్ మెసేజ్ తో మరియు  ఆధార్ కార్డ్ తో మీకు దగ్గరలోని ఏదయినా ప్రభుత్వ వాక్సిన్ కేంద్రానికి వెళ్లి ఈ టీకా తీసుకోవచ్చు. తేదీ: 18.05.2021 నుండి యధావిధిగా కోవిషీల్డ్ టీకా అన్ని ప్రభుత్వ వాక్సిన్ కేంద్రాలలో  అర్హులైన 2వ డోస్ వారికి ఇవ్వబడును. కోవిడ్ వాక్సిన్ పై కొన్ని ముఖ్య సూచనలు: కోవిడ్ వ్యాధి పోసిటివ్ వచ్చిన వారు, వ్యాధినుండి పూర్తిగా కోలుకున్న తర్వాత కనీసం 2 నెలల  వ్యవధి తర్వాత కోవిడ్ టీకా తీసుకోవచ్చు. ఒకవేళ మొదటి డోస్ తీసుకున్న తర్వాత కోవిడ్ వ్యాధి నిర్దారణ అయితే వారు […]

    Continue Reading ...
  • ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజనం

    మాస్ న్యూస్ : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి వద్ద కరోనా రోగులకు ప్రతీరోజు వెయ్యి మందికి ఉచిత భోజన కార్యక్రమాన్ని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ రేవంత్ మాట్లాడుతూ… సోనియాగాంధీ, రాహుల్ ఆదేశాల మేరకు… ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. లాక్‌డౌన్ కారణంగా పేషంట్స్ కుటుంబ సభ్యులకు భోజనాలు దొరకడం లేదన్నారు. ఫస్ట్ వేవ్‌లో కూడా ప్రభుత్వాలు కనీస సౌకార్యాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. యూత్ కాంగ్రెస్ తరపున అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. యూత్ కాంగ్రెస్ వర్క్ చేస్తుంటే అరెస్ట్‌లు చేస్తున్నారని మండిపడ్డారు. విచారణ పేరిట అడ్డుకుంటున్నారన్నారు. గాంధీ ఆసుపత్రి కోవిడ్ హాస్పిటల్ అయినా… కనీస సౌకర్యాలు లేవని… ఎవరి దగ్గర డబ్బులు లేవని తెలిపారు. డాక్టర్, నర్సులకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఆహారం ఏర్పాటు చేయలేదని విమర్శించారు. ప్రతి రోజు 1000 మందికి ఆహారం ఏర్పాటు చేస్తున్నామన్నారు. […]

    Continue Reading ...
  • అధికారులతో సమీక్ష సమావేశం : ఎమ్మెల్యే వనమా

    కొత్తగూడెం నియోజకవర్గం లోనీ కరోనా ప్రభావం పరిస్థితులపై మరియు లాక్ డౌన్ విషయంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే వనమా మాస్ న్యూస్ : కొత్తగూడెం నియోజకవర్గం లోని కరోనా ప్రభవం పరిస్థితులపై మరియు లాక్ డౌన్  విషయంపై వైద్య విధాన శాఖ అధికారులు, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, వైద్యాధికారుల తో సమీక్ష సమావేశం నిర్వహించిన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ సమీక్ష సమావేశంలోని  ముఖ్యాంశాలు. శానిటేషన్ పనులు బాగా చేయాలి. ఇంటింటి సర్వే కార్యక్రమం సరిగా అమలు అయ్యేలా చూడాలి. ప్రజలందరూ భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి ఎలా చర్యలు తీసుకోవాలని. కోవిడ్ పేషెంట్లకు సరైన వైద్యం అందించాలని. ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని. రెమిడీస్ సీవర్ ఇంజక్షన్ అందుబాటులో  ఉండేలా చూసుకోవాలని. హోమ్ స్లోషన్ లో ఉన్నవారికి కోవిడీ కిట్లు అందజేయాలని. పట్టణాల్లో, గ్రామాల్లో హైడ్రోక్లోరైడ్ […]

    Continue Reading ...
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో లాక్‌డౌన్‌ పటిష్టంగా అమలు

    మాస్ న్యూస్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా సెకండ్‌ వేవ్‌ లాక్‌డౌన్‌ పకడ్బందీగా కొనసాగుతోంది. బుధవారం నుండి రాష్ట్ర ప్రభుత్వం లాక్‌ డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలంతా ముందు జాగ్రత్తగా నిత్యవసర వస్తువులను మంగళవారం కొనుగోలు చేశారు. దీంతో ఆ రోజు మార్కెట్‌ మొత్తం రద్దీగా కనబడింది. లాక్‌ డౌన్‌ లో భాగంగా ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు మాత్రమే అనుమతి ఉండడంతో కూరగాయలు వంటి నిత్యావసర వస్తువుల కొనుగోలు కోసం మాత్రమే ప్రజలు ఇంటి నుంచి బయటకు వచ్చారు. కొత్తగూడెం డి.ఎస్‌.పి వెంకటేష్‌ బాబు నేతృత్వంలో ఆయా సర్కిల్‌ ఇన్స్పెక్టర్ లు వారి వారి పరిధిలో లాక్‌ డౌన్‌ అమలకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా కేంద్రమైన కొత్తగూడెంలో ప్రధాన రహదారుల వెంబడి బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు రోడ్లపై తిరగకుండా చర్యలు చేపట్టారు. సబ్‌ ఇన్స్పెక్టర్లు ఆయా ఏరియాలలో వాహనాలపై పెట్రోలింగ్‌ చేస్తూ […]

    Continue Reading ...
  • రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలి

    మాస్ న్యూస్ : రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు వెంటనే రద్దు చేయాలని CITU ఉపాధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు డిమాండ్ చేశారు. కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని కోరుతూ దేశ రాజధాని ఢిల్లీలో రైతాంగ పోరాటానికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పోరాడుతున్న రైతులకు సంఘీభావంగా రణస్థలం మండలం నెలివాడ గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

    Continue Reading ...
  • జర్నలిస్టు రఘును వెంటనే విడుదల చేయాలి : TUWJ IJU

    జర్నలిస్టు రఘు అక్రమ అరెస్టులకు నిరసన వెంటనే విడుదల చేయాలని డిమాండ్ ధర్నా మరియు నిరసన ప్రదర్శన మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : కొత్తగూడెం జిల్లా కేంద్రంలో TUWJ IJU కొత్తగూడెం ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నిరసన ప్రదర్శన చేశారు. తొలుత ఫ్లకార్డులతో నిరసన తెలిపి జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజాస్వామ్యానికి అర్థం లేకుండా పోయిందని తెలంగాణ అమరవీరుల సాక్షిగా అమరవీరుల స్తూపానికి వినతి పత్రాలను ఇచ్చారు. అనంతరం TUWJ IJU నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిధులు నియామకాలకోసం  ఏర్పాటైనది. స్వతంత్ర తెలంగాణ రాష్ట్ర లక్ష్యం నీరుకార్చుతూ  ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కెసిఆర్ ప్రభుత్వం జర్నలిస్టులపై చేస్తున్న దమనకాండను ఖండిస్తున్నామని అన్నారు. అక్రమంగా ముసుగులు వేసుకుని అంతర్జాతీయ ఉగ్రవాదిని అరెస్టు చేసినట్లు అరెస్టు చేయడం సరికాదన్నారు.

    Continue Reading ...
  • తెరాస ఎంపీ నామా ఇంట్లో ఈడీ సోదాలు

    మాస్ న్యూస్ : తెరాస లోక్‌సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆయనకు చెందిన మధుకాన్‌ గ్రూప్‌ సంస్థల  పేరుతో వివిధ బ్యాంకు లలో 1068 కోట్లు లోన్లు తీసుకుని విదేశాలకు మల్లించిన అభియోగం పై ఆయన ఇంటితో సహా ఐదు చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రుణాల పేరుతో బ్యాంకులను సుమారు రూ.వెయ్యి కోట్లకు మోసం చేసినట్లు వచ్చిన అభియోగాలతో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

    Continue Reading ...
  • ముస్లిం మైనార్టీ చాలా ఆనందంగా ఉన్నారు : కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు

    మాస్ న్యూస్ : ఈరోజు కొత్తగూడెం క్లబ్ లో కొత్తగూడెం కు వైద్య కళాశాల మంజూరు చేసిన ముఖ్యమంత్రి KCR కి, మెడికల్ కాలేజీ రావడానికి అహర్నిశలు కృషిచేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేసిన కొత్తగూడెం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు.ఈ సందర్భంగా మైనార్టీ నాయకులు మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గ లో ముస్లిం మైనార్టీలకు ఎప్పుడు అండగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు గారు ఉంటున్నారని, గతంలో ముస్లిం మైనార్టీల కొరకు షాదీ ఖాన్ ను నిర్మించి ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే వనమా గారుది అని, అలాగే నేడు కొత్తగూడెం కు మెడికల్ కాలేజీ తీసుకురావడంలో ఎమ్మెల్యే వనమా ఘనత ఎంతో ఉందని, ఎమ్మెల్యే వనమా గారి నాయకత్వంలో ముస్లిం మైనార్టీ చాలా ఆనందంగా ఉన్నారు అని అన్నారు .

    Continue Reading ...
  • KCR చిత్రపటానికి పాలాభిషేకం

    మాస్ న్యూస్ – లక్షిమిదేవిపల్లి : కొత్తగూడెం కు మెడికల్ కాలేజ్ మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, మరియు గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. ఈ యొక్క కార్యక్రమంలో రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీ వనమా రాఘవేంద్ర రావు, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ రేగా కాంతారావు, ఎమ్మెల్సీ శ్రీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా జడ్పీ చైర్మన్ శ్రీ కోరం కనకయ్య, జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, MPP భూక్యా సోన తదితరులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • చివరి చూపుకు కూడా చూసుకోలేని దిన స్థితిలో ఆ కుటుంబం

    మాస్ న్యూస్ : కరోనా మహమ్మారి కి ఓ నిండుచుళాలు బలియైన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే జిల్లా కలెక్టర్ కార్యాలయం టైపిస్టగా విధులు నిర్వహిస్తున్న జయసుధ 8 నెలలు నిండిన గర్భిణీ. ఆమె గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలతో కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు కొనసాగుతున్నాయి. జయసుధ ఇవ్వలో రేపో పండంటి బిడ్డకు జన్మనిచ్చి ఇంటికి తిరిగి వస్తుందని ఎదురు చూసిన అత్తమామలకు మరియు భర్తకు కరోనా మహమ్మారి కాటుకు బలైపోయి చివరి చూపుకు కూడా చూసుకోలేని దిన స్థితిలో ఉంది ఇప్పుడు ఆ కుటుంబం…..

    Continue Reading ...
  • ప్లాస్మా డోనేష‌న్ వెబ్‌పేజీ ప్రారంభం

    మాస్ న్యూస్ – హైద‌రాబాద్ : క‌రోనా మ‌హ‌మ్మారి సంక్షోభం ప్రారంభమైన‌ప్ప‌టి నుండి పోలీసులు స‌మాజానికి ఏదో రూపంలో సేవ చేస్తూనే ఉన్నార‌ని రాచ‌కొండ పోలీస్ క‌మిష‌న‌ర్ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ తెలిపారు. శ‌నివారం ప్రాణ వాయు సేవ‌, ప్లాస్మా డోనేష‌న్ వెబ్‌పేజీ ప్రారంభం అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. అవ‌స‌రార్థుల‌కు ఆహారం అందించ‌డ‌మైతేనేమి, ఉచిత క్యాబ్ స‌ర్వీసెస్‌, ఉచిత అంబులెన్స్ సేవ‌లు, అనాథాశ్ర‌మాలు, వృద్ధాశ్ర‌మాల‌ను దత్త‌త తీసుకోవ‌డం ఇలా సాధ్య‌మైన ప్ర‌తీది పోలీసులు చేస్తున్నార‌న్నారు. రాచకొండ పోలీసులు 77 మంది ఇప్ప‌టి వ‌ర‌కు ప్లాస్మాను దానం చేశార‌న్నారు. కొవిడ్ కంట్రోల్ రూమ్‌కి వ‌చ్చే అభ్యర్థనలలో 70 శాతం ప్లాస్మా కోసం ఉంటున్నాయ‌న్నారు. రాచకొండ పోలీసులు వీలైనంత సాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌న్నారు. కాగా ఎక్కువ మంది దాతలు ముందుకు వస్తేనే భారీ డిమాండ్‌ను తీర్చవచ్చ‌ని పేర్కొన్నారు. అందుకే రాచ‌కొండ సెక్యూరిటీ కౌన్సిల్ స‌హకారంతో https://donateplasma.rksc.in, వెబ్‌పేజీని ప్రారంభించిన‌ట్లు తెలిపారు. దాతలు ముందుకు వ‌చ్చి ఇందులో […]

    Continue Reading ...
  • కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఫ్యాక్టరీల నిర్మాణ పనులను పరిశీలన చల్లా

    మాస్ న్యూస్ : వరంగల్ రూరల్ జిల్లాలోని గీసుకొండ మండలం శాయంపేట శివారులోని కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు చేపట్టిన ఫ్యాక్టరీల నిర్మాణ పనులను పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా మాట్లాడుతూ.. 20 ఎకరాల స్థలంలో 6 యూనిట్లుగా విభజించి గణేశా ఈకో టెక్ ప్రవేట్ లిమిటెడ్, గణేశా ఈకో పెట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు నిర్మాణం చేపట్టాయన్నారు. మొదటి యూనిట్ ఈ సంవత్సరం డిసెంబర్ లోగా ప్రారంభించుకోనున్నట్లు తెలిపారు.

    Continue Reading ...
  • అధైర్య పడవద్దు చివరి గింజ వరకు వడ్లు కొంటాం : టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు

    మాస్ న్యూస్ : బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ లో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన టెస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు. రైతులతోమాట్లాడుతూ అధైర్య పడవద్దు చివరి గింజ వరకు వడ్లు కొంటాం అని అన్నారు. రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా చూస్తున్న కొండ రమేష్ గౌడ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొండ రమేష్ గౌడ్ టీఆరెస్ నాయకులు సింగారం మల్లేశం మార్కెట్ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు.

    Continue Reading ...
  • కరోనా వైరస్ కట్టడికి అందరికీ అందుబాటులో వ్యాక్సిన్లు

    మాస్ న్యూస్ : కొవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి పరస్పరం సహకరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్లు, మందులు సమానంగా అందరికీ అందుబాటులో ఉండాల్సిన ఆవశ్యకతపై వీరిద్దరూ పరస్పరం అంగీకారానికి వచ్చారు. దీనిపై నిబంధనలతో కూడిన అంతర్జాతీయ విధానం కోసం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత, పరస్పర సహకారంతో కూడిన విధానం ఏర్పాటుకు కలసి కట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకతపై కూడా ఉభయులు చర్చించారు. శుక్రవారం ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోడీ కొవిడ్-19 సెకండ్ వేవ్‌పై పోరాటంలో ఆస్ట్రేలియా ప్రభుత్వం, ఆ దేశ పౌరులు అందచేస్తున్న సహకారానికి కృతజ్ఞతలు తెలిపినట్లు ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కరోనా వైరస్‌ను ప్రపంచవ్యాప్తంగా కట్టడి చేసేందుకు వ్యాక్సిన్లు, మందులు అందరికీ అందుబాటు ధరలలో, సమానంగా లభించేందుకు కృషిచేయాల్సిన ఆవశ్యకతపై ఉభయ దేశాల ప్రధానమంత్రులు ఒక అంగీకారానికి వచ్చారని […]

    Continue Reading ...
  • నర్సీపట్నం స్పందన లో సబ్ కలక్టర్ మౌర్య 31 వినతుల స్వీకారం

    మాస్ న్యూస్ : సోమవారం జరిగిన స్పందన లో 31వినతులను స్వీకరించడం జరిగిందని సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఒక ప్రకటనలో తెలిపారు. రోలుగుంట 3, గొలుగొండ 2 , నర్సీపట్నం 8, నాతవరం 7, మాకవరపాలెం 7, జిల్లా కలెక్టర్ కార్యాలయానికి సంబంధించి 4, మొత్తం 31 దరఖాస్తులు వచ్చాయన్నారు. సంబంధిత మండల అధికారులకు వినతుల కు సంభందించిన సమస్యలను సత్వర పరిష్కారం గావించాలిసిందిగా ఆదేశించడం జరిగిందన్నారు. స్పందన లో సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి ప్రసాద్ హాజరయ్యారు.

    Continue Reading ...