Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి : కలెక్టర్ అనుదీప్

జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి : కలెక్టర్ అనుదీప్

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్ – భద్రాద్రి కొత్తగూడెం : ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని చాటి చెప్పిన మహనీయుడు జాతిపిత మహాత్మాగాంధీ అని జిల్లా కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. శనివారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్ లో గాంధీ జయంతి వేడులకు ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనుదీప్ గారు మాట్లాడారు. మహాత్ముడు ఏది చెప్పారో అది ఆచరించారని తెలిపారు. అహింసా సిద్ధాంతాన్ని నమ్మి ప్రపంచ దేశాల మద్దతు పొందారని తెలిపారు. అహింసతోనే ఏదైనా సాధించవచ్చని నమ్మి, భారత దేశానికి స్వాతంత్య్రం తీసుకు వచ్చిన మహానీయుడు గాంధీ అని కొనియాడారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలని చెప్పారని తెలిపారు. గ్రామాల అభివృద్ధితోనే దేశ ప్రగతి సాధిస్తుందని చెప్పారన్నరు. అంటరాని తనం నిర్మూలనకు ఎంతో కృషిచేశారన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ కలలు కన్న ఆశయాలు కోసంకృషి చేస్తున్నాయని తెలిపారు. స్వచ్ఛాభారత్ పథకాన్ని మిషన్ కొనసాగిస్తున్నారని తెలిపారు. విదేశాల్లో చదువు ముగించుకుని భారత దేశానికి తిరిగి వచ్చిన తరువాత గాంధీ మహాత్ముడు దేశం మొత్తం పర్యటించి , దేశంలోని ప్రజలు ఎలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. గ్రామాలు ఎలా ఉన్నాయి. వారి జీవిన విధానం ఎలా ఉందని ఆనాడే సునిశితంగా పరిశీలన చేశారని తెలిపారు. అపరిశుభ్రత వలన గ్రామీణ ప్రజలు ఆనారోగ్యం బారిన పడుతున్న విషయాన్ని గమనించారు. ఆయన ఆశయాలు నేడు ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయన్నారు. వాటిని కింది స్థాయి ప్రజలకు అందేవిధంగా పనిచేయాలని కోరారు. స్వచ్చ భారత్ లో మన జిల్లాను అన్ని రంగాల్లో ప్రధమ స్థానంలో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం జిల్లాలోని ఇతర అధికార యంత్రాంగానికి రోల్ మోడల్ గా ఉండే విధంగా కలక్టరేట్ ఉద్యోగులు మహాత్ముని జీవితంలో చూపిన విధంగా చిత్త శుద్ధితో, మనుసు పెట్టి పనిచేయాలని కోరారు. అనంతరం కొత్తగూడెం సూపర్ ఐజార్ సెంటర్ లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ అనుదీప్ పూల మాల వేసి నివాళి అర్పిచారు.

స్వచ్ఛభారత్ మిషన్, స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో భాగంగా విశిష్ట సేవలు అందించిన కొత్తగూడెం, పాల్వంచ మున్సిపల్ పరిధిలో పని చేస్తున్నా పలువురు పారిశుద్ధ్య కార్మికులను జిల్లా కలెక్టర్ అనుదీప్ ప్రశంస పత్రాలు, శాలువాలతో సత్కరించారు.

ఈ కార్యక్రమంలో DRO అశోక్ చక్రవర్తి , AO గన్యా , మున్సిపల్ చైర్ పర్స న్ కాపు సీతాల క్ష్మీ , కమీషనర్ A.సంపత్ కుమార్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.

Tagged with:

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.