కుర్రాళ్ళతో డేటింగ్ చేసిన అక్షర.
మాస్ న్యూస్: మూడు పదులకు చేరువైన శ్రుతి హాసన్ ఆరేళ్ళ క్రితం ‘లక్కీ’మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి… తొలి సినిమాలోనే అందాలను నిరభ్యంతరంగా ఆరబోసింది. ఆ తర్వాత టాలీవుడ్ లోకి అడుగుపెట్టి ఇక్కడా గ్లామరస్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంది. అంతేకాదు… అతి తక్కువ సమయంలో సత్తాను చాటి… స్టార్ డాటర్స్ సైతం శృంగార నాయికలుగా రాణించగలరని తెలియచేసింది. బహుశా అక్కలోని ఈ డేరింగ్ నెసే అక్షరకూ నచ్చినట్టుంది! హీరోయిన్ కాకముందే… ఫిల్మ్ ఫీల్డ్ కు చెందిన కుర్రాళ్ళతో డేటింగ్ చేసిన అక్షర… అనేక విషయాల్లో తన ప్రత్యేకత చాటుకుంది.యాక్టింగ్ ను కెరీర్ గా తీసుకున్నతర్వాత ఊహించని విధంగా ఇండివిడ్యువాలిటీని ప్రదర్శిస్తున్నారని ఆశ్చర్యపోతున్నారు. సెలబ్రిటీస్ లో అత్యధిక టాటూస్ ఉన్నది అక్షరకే నట. ఆమె శరీరంలోని వివిధ భాగాల్లో మొత్తం తొమ్మిది టాటూస్ ఉన్నాయట! అంతేకాదు… జుత్తుకు పెర్పుల్ కలర్ వేసుకుని… కొంగొత్తగా కనిపించిన అక్షర ఈ మధ్యే మళ్ళీ నేచురల్ కలర్ లోకి జుత్తును మార్చుకుంది!
Leave a reply
You must be logged in to post a comment.