Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
హైదరాబాద్‌ మహానగరంలో అమెజాన్‌ రంగప్రవేశం

హైదరాబాద్‌ మహానగరంలో అమెజాన్‌ రంగప్రవేశం

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్: హైదరాబాద్‌ మహానగరంలో అమెజాన్‌ రంగప్రవేశం చేయబోతోంది. హైదరాబాద్‌లో అతి పెద్ద గోదాముల నిర్మాణం చేపట్టేందుకు ఆ కంపెనీ అంగీకరించింది. ఈ గోదాముల నిర్మాణానికి భూమిని లీజు పద్దతిలో తీసుకోనున్నట్లు తెలిసింది. రెండు నెలల్లో నిర్మాణం పూర్తి చేయ నున్నట్లు ఆ కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన పారిశ్రామిక విధానం ప్రకారం అమెజాన్‌ కంపెనీకి రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. రాష్ట్రంలో ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆన్‌లైన్‌ వాణిజ్యంపై అమెజాన్‌ శిక్షణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆన్‌లైన్‌ వాణిజ్యం ద్వారా ఏ విధంగా ఆదాయాన్ని పొందవచ్చునో ఆ సంస్థలకు అవగాహన కల్పించ నుంది.. తెలంగాణ రాష్ట్రంలో స్వయం సహాయక బృందాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. వీటి ఉత్పత్తులు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. తెలంగాణ రాష్ట్రంలో
కూడా చేతివృత్తుల ఉత్పత్తులను కూడా అమెజాన్‌ వేదికగా ఆన్‌లైన్‌లో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహించేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం. తెలంగాణలో నిర్మల్‌ చేతివృత్తులు, పోచంపల్లి, నారాయణపేట, గద్వాల చీరలు, బిద్రీజరి వంటి ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో విక్రయించేందుకు అమెజాన్‌ ముందుకు వచ్చినట్లు తెలిసింది. దీని కోసం ప్రత్యేక ప్రణాళికను కూడా ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు సమాచారం.
వాస్తవానికి ఆన్‌లైన్‌ వాణిజ్యంలో అమెజాన్‌ది అందెవేసిన చేయి. దక్షిణాది రాష్ట్రాల్లో బెంగూళూరు కేంద్రంగా పనిచేస్తున్నది. ఆన్‌లైన్‌ వాణిజ్య కార్యకలపాల వల్ల సంబంధిత రాష్ట్రానికే పన్నులను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో హైదరాబాద్‌లో నెలకొల్పడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి భారీస్థాయిలో పన్నులు రాబడి వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలోని చేతి వృత్తులు, ఉత్పత్తులను ప్రపంచానికి చాటేందుకు అమెజాన్‌ ముందుకు రావడం హర్షణీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో అమెజాన్‌ని ప్రారంభిస్తున్నట్లు ఈ నెల రెండో వారంలో అధికారికంగా వెల్లడించే అవకాశమున్నట్లు తెలిసింది.
కేటీఆర్‌ను కలిసిన అమెజాన్‌ ప్రతినిధులు
పంచాయతీరాజ్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావును అమెజాన్‌ ప్రతినిధులు కలిశారు. బుధవారం సచివాలయంలో మంత్రి కేటీఆర్‌ చాంబర్‌లో అమెజాన్‌ గ్లోబల్‌ డైరెక్టర్‌ జాన్‌ స్కాయిల్టర్‌ బృందం కేటీఆర్‌తో భేటీ అయింది. తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు తగిన సదుపాయాలపై చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ ఉత్పత్తులను కూడా ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు వారు మంత్రికి తెలియజేసినట్లు తెలిసింది. ఈ భేటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర, ఐటీ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్‌సింగ్‌, తెలంగాణ రాష్ట్ర మౌలిక వసతుల సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జయేష్‌రంజన్‌, అమేజన్‌ కంపెనీ ఇండియా డైరెక్టర్‌ నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.