Breaking News
November 13, 2022 - నాయకుల ఒత్తిడి తో కేసును పట్టించుకోని పోలీసులు
November 12, 2022 - బ్లాక్మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్న కడారి వెంకన్న సహకరిస్తున్న నాయకులు
September 22, 2022 - సెలెన్ బాటిల్ లో పాయిజన్ ఇంజక్షన్ చేసి భార్యను చంపిన భర్త
September 22, 2022 - 10 రంగుల్లో 240 రకాల త్రెడ్ బోర్డర్‌తో బతుకమ్మ చీరలు : మంత్రి కేటీఆర్
November 13, 2021 - కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి హరీష్ రావు
November 13, 2021 - అనాధాశ్రమాన్ని సందర్శించిన పాల్వంచ ASP రోహిత్ రాజు IPS
November 13, 2021 - ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో TDP నుండి కాంగ్రెస్ లో భారీ చేరికలు
November 12, 2021 - బదిలీ వేటు వేసి చేతులు దులుపుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలి : BSP జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
November 12, 2021 - రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా బారి ర్యాలీ
November 11, 2021 - రైతులతో పాటు రైతు బిడ్డలకు కూడా అండగా సహకార కేంద్ర బ్యాంక్ – DCCB చైర్మన్
ప్రెస్‌ స్టిక్కర్‌ పెట్టుకుని దర్జాగా తిరుగుతున్న చికెన్‌ వ్యాపారి

ప్రెస్‌ స్టిక్కర్‌ పెట్టుకుని దర్జాగా తిరుగుతున్న చికెన్‌ వ్యాపారి

Spread the love
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

మాస్ న్యూస్ : నగరంలో లాక్‌డౌన్‌ ఆంక్షలను ఉల్లంఘించేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు కొందరు, ఆంక్షల సడలింపుల్లో ఉన్న Press స్టికర్ ను తమకు అనుకూలంగా వాడుకుంటున్న ఉల్లంఘనులు చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలవుతున్నారు. కారుకు  Press స్టిక్కర్‌ పెట్టుకుని లాక్‌డౌన్‌ సమయంలో దర్జాగా తిరుగుతున్న చికెన్‌ వ్యాపారిపై చీటింగ్‌ కేసు నమోదు చేసి కారును సీజ్‌ చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ కు తరలించారు, CI నరేష్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన బొమ్మగాని ఉపేందర్‌ చికెన్‌ వ్యాపారి. లాక్‌డౌన్‌ సమయంలో పోలీసు తనిఖీలు ముమ్మరం కావడంతో తన సొంతకారు (TS 09 EF 4174)కు ప్రెస్‌ స్టిక్కరు పెట్టుకుని దర్జాగా తిరుగుతున్నాడు., చిలకలగూడ పోలీసులు సీతాఫల్‌మండి చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఉపేందర్‌ తన కారులో అటుగా వచ్చాడు. పోలీసులు కారును ఆపగా రిపోర్టర్‌ను అంటూ దబాయించాడు. ఏ పత్రికలో పనిచేస్తున్నావో ఐడెంటిటీ కార్డు చూపించమని కోరగా నీళ్లు నమిలాడు. వాస్తవానికి తాను చికెన్‌ వ్యాపారినని, లాక్‌డౌన్‌ సమయంలో సడలింపు ఉండడంతో తన కారుకు ప్రెస్‌ స్టిక్కర్‌ అతికించానని వివరించాడు. లాక్‌డౌన్‌ ఆంక్షలు ఉల్లంఘించినందుకు కారును సీజ్‌ చేయడంతోపాటు జరిమాన విధించారు. ప్రెస్‌ పేరిట మోసానికి పాల్పడిన ఉపేందర్‌పై చీటింగ్‌ కేసు నమోదు చేసినట్లు సీఐ నరేష్‌ వివరించారు.

Related Articles

Leave a reply

You must be logged in to post a comment.